‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయి పల్లవి మొదటి చిత్రంతోనే మంచి మార్కులు వేయించుకుంది. తమిళ్ అమ్మాయి అయినప్పటికీ.. అచ్చ తెలుగు అమ్మాయిలా ఆ చిత్రంలో కనిపించింది. తెలంగాణ యాసలో కూడా అదరగొట్టిందనే చెప్పాలి.ఆ చిత్రంతో కుర్ర కారుకి ఈమె క్రష్ గా కూడా మారిపోయింది. ఇదిలా ఉండగా.. తనకు క్రేజ్ ఉంది కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చెయ్యడానికి సాయి పల్లవి ఓకే చెప్పదు.
ముఖ్యంగా హీరో పాత్రను పెంచి తన పాత్రను తగ్గించే సినిమాలు అస్సలు చెయ్యదు.కచ్చితంగా సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంది అంటేనే ఓకే చెబుతుంది. తనను సంప్రదించింది పెద్ద డైరెక్టర్,పెద్ద ప్రొడ్యూసర్ అయినా సరే..నచ్చకపోతే మొహం మీదే నో చెప్పేస్తుంటుంది మన రౌడీ బేబీ. సరిగ్గా ఇలాగే.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వినిపించిన రెండు కథలకు ఈమె నో చెప్పిందట. నిజానికి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ఈమెనే హీరోయిన్ గా అనుకున్నారు. కానీఆ ఆఫర్ ను ఈమె రిజెక్ట్ చేసింది. దాంతో రష్మిక ను ఎంపిక చేసుకున్నారు. ఇలాంటి సీన్ ఇప్పుడు మరోసారి రిపీట్ అయ్యిందని వినికిడి.
వివరాల్లోకి వెళితే.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాతగా ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాని ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం సాయి పల్లవిని ఎంపిక చేసుకోవాలని ఆమెను సంప్రదిస్తే నో చెప్పిందని టాక్. అనిల్ వినిపించిన కథలో తన పాత్ర నచ్చకపోవడం వల్లనే ఈమె రెండో సారి కూడా రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. దిల్ రాజు చొరవ చేసుకుని సాయి పల్లవిని కన్విన్స్ చెయ్యడానికి ప్రయత్నించినా ఆమె ఒప్పుకోలేదట.దీంతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ లు అయినా సరే.. కథ నచ్చకపోతే ఈమె లెక్కచెయ్యదు అని మరోసారి ప్రూవ్ అయ్యింది.