సినిమా – సీజన్… ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. సరైన సీజన్ కోసం మన దర్శకనిర్మాతలు వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రేక్షకులకు ఎక్కువ సమయం ఉండేది పండగ రోజుల్లోనే కాబట్టి… ఆ రోజుల్లో సినిమా రిలీజ్ చేస్తే… థియేటర్లకు వస్తారనేది ఆలోచన. కరోనా పరిస్థితులు వచ్చాక సినిమా సీజన్ల లెక్క మారిపోయింది. సినిమా విడుదలకు ఎప్పుడు అవకాశం వస్తే… అప్పుడే సీజన్. కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. దీంతో దగ్గర్లో ఉన్న సీజన్ దసరా. దీంతో అందరి దృష్టి దసరా మీదే పడింది.
మామూలుగా పరిస్థితులు ఉండుంటే దసరాకు కనీసం రెండు, మూడు సినిమాలు వచ్చేవి. కానీ ఈసారి చూస్తుంటే లిస్ట్ ఏకంగా పదికిపైగా సినిమాల వరకు సిద్ధంగా ఉన్నాయి. దసరా సినిమాల గురించి చర్చిస్తే… ముందుగా వచ్చే పేరు ‘ఆర్‌ఆర్‌ఆర్’. సినిమాను ఎట్టిపరిస్థితుల్లో అక్టోబరులో రిలీజ్ చేస్తాం అంటున్నారు. ఇదికాకుండా చిరంజీవి ‘ఆచార్య’, బాలకృష్ణ ‘అఖండ’, వెంకటేష్ ‘ఎఫ్ 3’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’, యష్ ‘కేజీఎఫ్’, అల్లు అర్జున్ ‘పుష్ప’, నాని ‘శ్యామ్ సింగరాయ్’, ‘టక్ జగదీష్’… నాగచైతన్య ‘థ్యాంక్ యూ’, ‘లవ్‌స్టోరీ’… రానా ‘విరాటపర్వం’, నితిన్ ‘మాస్ట్రో’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ లాంటివి చాలా ఉన్నాయి.
వీటిలో ఎన్ని దసరాకు ఎన్ని సిద్ధమవుతాయి, ఎన్ని సినిమాలకు థియేటర్లు దొరుకుతాయి అనేది చూడాలి. అయితే కరోనా థర్డ్ వేవ్ పరిస్థితులు కూడా సినిమా విడుదల విషయంలో ప్రభావం చూపించనుంది. శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్న మాటల ప్రకారం అయితే… సెప్టెంబరులో థర్డ్ వేవ్ వస్తుందని అంటున్నారు. అదే జరిగితే మళ్లీ థియేటర్లు మూసేసే అవకాశం ఉంది. కాబట్టి దసరా సీజన్ ఎంతవరకు ఉంటుంది. అప్పుడు ఏ సినిమాలు వస్తాయో చూడాలి. అయతే కొన్ని సినిమాలు దసరాకు ముందే వచ్చేస్తాయంటున్నారు.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!