Bandla Ganesh: మిస్ ఫైర్ అయిన ట్వీట్… మళ్ళీ దొరికిపోయిన బండ్ల గణేష్ .. ట్రోలింగ్ షురూ..!

మన పెద్దవాళ్ళు ఓ సామెత చెబుతూ ఉంటారు. ‘చూసి రారా అంటే కాల్చి వచ్చినట్టు’ అని..! ఇది టాలీవుడ్ కమెడియన్, నిర్మాత, నటుడు అయిన బండ్ల గణేష్ కు కరెక్ట్ గా సరిపోతుంది. మనోడు ఏం వాగినా.. ఏం ట్వీటినా సెన్సేషనే..! ఈయన ఏదైనా వేడుకకు వెళ్లి మైక్ పట్టుకున్నాడు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వేళ్తాడో తెలీదు. ఇటీవల జరిగిన ‘చోర్ బజార్’ ప్రీ రిలీజ్ వేడుక అందుకు ఉదాహరణ.

పూరీ జగన్నాథ్‌ ఆ వేడుకకు రాకపోతే.. అది కవర్ చేయడం మానేసి.. అతని పర్సనల్ వ్యవహారాన్ని కెలికాడు. పూరి ఈ విషయం పై పరోక్షంగా కౌంటర్ కూడా వేసి అంతకు మించి ఏమీ చేయలేక ఊరుకున్నాడు. ఏదేమైనా గుట్టుగా ఉన్న పూరి వ్యవహారాన్ని అల్లరల్లరి చేసి పారేశాడు బండ్ల గణేష్. పోనీ మాట్లాడేప్పుడు ఏదైనా కన్ఫ్యూజన్ ఏర్పడొచ్చు. కానీ ట్వీట్ చేసేటప్పుడు అయినా కరెక్ట్ గా చేయాలి కదా.

అది చేయడు…ట్వీట్లు సరిగ్గా చేయకపోవడం వల్ల చాలా సార్లు ట్రోలింగ్ కు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. నిన్న దిల్ రాజు కి అబ్బాయి పుట్టాడు. అందుకు సంబంధించిన ఫోటోని కూడా షేర్ చేసి తన ఆనందాన్ని తెలిపాడు దిల్ రాజు. ఈ సందర్భంగా దిల్ రాజు కి కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ వేశాడు బండ్ల గణేష్.

ఇందులో తప్పేమీ లేదు కాకపోతే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అఫీషియల్ ట్విట్టర్ ట్యాగ్ ‘@SVCCofficial’ కు బదులు ‘@SVCC'(శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర) అఫీషియల్ ట్విట్టర్ ట్యాగ్ ను జత చేశాడు. అది మన బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ గారి నిర్మాణ సంస్థ కు సంబంధించిన ట్యాగ్. అంతే బండ్ల గణేష్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus