Surekha Vani: అల్లు అర్జున్ పాటకు డ్యాన్స్.. సురేఖ వాణి పై ట్రోలింగ్ షురూ..!

ఒకప్పుడు సినిమా సెలబ్రిటీలు బయట ఎక్కడైనా కనిపిస్తే చాలా విడ్డూరంగా, గొప్పగా చెప్పుకునే వారు. ఇప్పుడైతే వాళ్ళతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ అందరికీ దొరికేసింది. ఇన్స్టాగ్రామ్ లేదా ట్విట్టర్ ఖాతా ఉంటే చాలు నేరుగా సెలబ్రిటీలకు రీచ్ అయ్యేలా ఎటువంటి ప్రశ్నలు అయినా అడిగెయ్యొచ్చు. అభిమానులకి దగ్గరగా ఉండటం అనేది సెలబ్రిటీలకు ప్రమోషన్ లాంటిది కాబట్టి… వాళ్ళు కూడా తమ ఫాలోవర్స్ తో ఏదో ఒక రకంగా టచ్ లో ఉంటుంటారు.

ఒక్కోసారి ఇది వాళ్ళను ఇబ్బంది పెడుతుంది కూడా..! సురేఖ వాణి విషయంలో ఇది మరోసారి రుజువైంది. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన సురేఖ వాణి కి ఈ మధ్య కాలంలో అవకాశాలు తగ్గడంతో దర్శక నిర్మాతలు అట్రాక్ట్ అయ్యే విధంగా ఏదో ఒక పోస్ట్ పెడుతూ తన సొంత ప్రమోషన్ తాను చేసుకుంటూ వస్తుంది. ఇదే క్రమంలో తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘సరైనోడు’ చిత్రంలో సూపర్ హిట్ సాంగ్ అయిన ‘తెలుసా తెలుసా’ కి రొమాంటిక్ మూమెంట్స్ చేసింది.

ఆమె ఓ హీరోయిన్ గా ఇన్వాల్వ్ అయిపోయి మరీ ఆ లిరిక్స్ కు లిప్స్ కలిపింది. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా ట్రోలింగ్ మొదలైంది. ‘మీ అమ్మాయి పెళ్ళీడుకొచ్చింది.ఆమె పెళ్లయ్యే వరకు మీరు ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది. లేదంటే ఆమెను చేసుకోవాల్సినోడు మిమ్మల్ని చేసుకుంటానంటాడు’ అంటూ కొంతమంది అంటుంటే మరికొంతమంది ‘మేడమ్ మీ అభిమానిగా చెబుతున్నాను కొన్నాళ్ళు ఇలాంటివి తగ్గించుకోండి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఏడాది విడుదలైన ‘బంగార్రాజు’ చిత్రంలో ఈమె నటించింది. ప్రస్తుతం ‘రామారావు ఆన్ డ్యూటీ’ ‘స్వాతి ముత్యం’ వంటి చిత్రాల్లో నటిస్తోంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus