మెగాస్టార్ తో ఖుష్బూ మరోసారి?

మోహన్ లాల్ హీరోగా పృథ్వి రాజ్ సుకుమారన్ డైరెక్షన్లో తెరకెక్కిన మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘సాహో’ దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ పై రాంచరణ్ నిర్మించనున్నాడు. ఇదిలా ఉండగా ‘లూసిఫర్’ లో మంజు వారియర్ పాత్ర చాలా కీలకమైంది. హీరోకి వరుసకు సోదరి అనే విధంగా ఆ పాత్ర ఉంటుంది.

అయితే తెలుగు లో ఈ పాత్రను ఎవరు చేయబోతున్నారు అనే ఆశక్తి అందరిలోనూ నెలకొంది. మొదట విజయశాంతి, సుహాసిని వంటి సీనియర్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు కోలీవుడ్ నటి కుష్బూని ఫిక్స్ చేసినట్టు సమాచారం.చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఇంకా ఈ విషయం పై క్లారిటీ ఇవ్వలేదు. కానీ దాదాపు కుష్బూ ఫైనల్ అయిపోయినట్టే అని టాక్ వినిపిస్తుంది. అందులోనూ ‘లూసిఫర్’లో ని చెల్లి పాత్రకు ఈమె పర్ఫెక్ట్ గా సరిపోతుందని చిత్ర యూనిట్ సభ్యులు డిసైడ్ అయ్యారట.

ఈమె పాత్ర ప్రకారం.. మొదటి నుండీ చిరు పై ద్వేషంతో ఉంటుంది. కానీ చివరికి చిరు సాయం కోరుతుంది. ఈ పాత్ర సినిమాలో చాలా ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తుంది. గతంలో ‘స్టాలిన్’ సినిమాలో కూడా మెగాస్టార్ కు కుష్బూ సిస్టర్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక త్వరలో దర్శకుడు సుజీత్ పెళ్లి ఉండడంతో ఈ చిత్రం కాస్త ఆలస్యంగా మొదలయ్యే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తుంది. ఈ గ్యాప్ లో మెగాస్టార్ కూడా ‘ఆచార్య’ కంప్లీట్ చేస్తారని సమాచారం.

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus