Chiranjeevi: చిరు సినిమాకి మళ్ళీ ఆ డైరెక్టర్ తలనొప్పిగా మారాడా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్నారు. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా అనిల్ సుంకర నిర్మాత. అయితే అనిల్ సుంకర నిర్మించిన గత చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఓ సినిమా ప్లాప్ అయ్యి నష్టాలు వస్తే నిర్మాత కొంత నష్టపరిహారం చెల్లించాలి అనే ఆనవాయితీ ఎప్పటి నుండో ఉంది. అయితే సెటిల్మెంట్లు అనేవి పర్ఫెక్ట్ గా ఉండాలి. లేకపోతే డిస్ట్రిబ్యూటర్లు మళ్ళీ గొడవ చేసేస్తారు. ఇప్పుడు నిర్మాత అనిల్ సుంకర సెటిల్మెంట్ చేసే పనిలో ఉన్నారు.

‘ఆయన ఎవరికైనా ఇవ్వాల్సిన రూపాయి ఉంచుకునే రకం కాదు’ అనే మంచి పేరు ఎప్పుడో సంపాదించుకున్నాడు.కాబట్టి ‘వ‌చ్చే సినిమాలో అడ్జస్ట్ చేస్తాను’ అంటే బయ్యర్స్ ఒకే అనియ్యాలి. ఇంతకు ముందు వరకు అలాగే జరిగేది. కానీ ఇప్పుడు ఆయన మాట వినడం లేదు అని భోగట్టా. ఎందుకంటే ‘భోళాశంక‌ర్’ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు అంతగా నమ్మకం లేదు. దానికి కారణాలు ఏంటో అందరికీ తెలుసు. అనిల్ సుంకర నిర్మించిన ముందు సినిమా హిట్ అయ్యి ఉంటే ఈ ప్రాబ్లమ్ వచ్చేది కాదు.

కానీ స్క్రిప్ట్ కూడా లేకుండా ఆ సినిమా దర్శకుడు చేసిన పొరపాటు వల్ల ఇదంతా జరిగింది. ఆ డైరెక్టర్ కూడా గతంలో చిరుతో సినిమా చేసిన వ్యక్తే.! ఆ సినిమా సెట్స్ లో చిరు చెప్పింది వినకుండా ఏదేదో చేసేసాడు. ఫలితం ఓ మాదిరిగా వచ్చింది. అయితే ఆ సినిమాకి అనవసరమైన సన్నివేశాలు చాలా తీసి బడ్జెట్ పెంచేసాడు అనే టాక్ కూడా అప్పట్లో జోరుగా నడిచిందని. ఇప్పుడు మళ్ళీ ఆ దర్శకుడి వల్లే చిరు (Chiranjeevi) సినిమాకి సమస్యలు వచ్చి పడ్డాయి అని స్పష్టమవుతుంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus