వద్దు బాబోయ్ అంటూ ఆ డైరెక్టర్ కు వరస ఫోన్లు..!

నితీష్ తివారీ కలల చిత్రం ‘రామాయణం’ అతి త్వరలో తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన పాత్రలైన శ్రీరాముడు, సీత పాత్రల కోసం నటీనటుల ఎంపిక పూర్తయింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ శ్రీరాముని పాత్రను పోషిస్తుండగా, సాయి పల్లవి సీత పాత్రను పోషిస్తుంది. ఇంతకుముందు అలియా భట్ సీత పాత్రను పోషిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే డేట్ సమస్యల కారణంగా అలియా ఈ చిత్రం నుండి తప్పుకుంది.

ఇప్పుడు సాయి పల్లవిని ఎంపిక చేశారు మేకర్స్. ‘రామాయణం’లో రావణుడిని కూడా వెతికారని సమాచారం. సౌత్ సూపర్ స్టార్ యష్ ఈ చిత్రంలో రావణుడి పాత్రలో కనిపిస్తారు. నితీష్ తివారీ తన కలల చిత్రం ‘రామాయణం’ని రెండు భాగాలుగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మొదటి భాగంలో రణబీర్ కపూర్, సాయి పల్లవిపై దృష్టి పెడితే, రెండవ భాగంలో యష్ రావణుడిగా పెద్ద పాత్రలో కనిపించనున్నాడు. 2024 ప్రారంభంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి ‘రామాయణం’ పార్ట్ 1 షూటింగ్ ప్రారంభిస్తారని నివేదికలు చెబుతున్నాయి.

వచ్చే ఏడాది జులై నుంచి యష్ తన షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఇది ఇలా ఉంటే.. ప్రభాస్, కృతి సనన్ ప్రధాన పాత్రలు పోషించిన ‘రామాయణం’ ఆధారంగా ‘ఆదిపురుష్’ చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమా జనాలకు నచ్చకపోవడంతో పలు వివాదాల్లో కూరుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ‘రామాయణం’ తీయవద్దని చాలా మంది నితీష్ తివారీకి సలహా ఇచ్చారు. అయితే, చిత్ర నిర్మాత తన (Nitesh Tiwari) నిర్ణయంపై గట్టిగానే ఉన్నాడు. అతి త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నాడు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus