కరోనా మహమ్మారి ఇప్పట్లో విడిచిపెట్టేలా కనిపించడం లేదు.ఇప్పుడు మళ్ళీ కరోనా విజృంభిస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం మరోసారి సినిమా థియేటర్లను బంద్ చేయాలని తీర్మానించింది.కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత మొదట థియేటర్లు ఓపెన్ అయ్యింది అక్కడే.50 శాతం ఆక్యుపెన్సీతో అక్కడ థియేటర్లు రన్ అవుతూ వచ్చాయి.కానీ ఇప్పుడు మరోసారి అవి మూతపడుతుండడంతో సినీ ప్రియులను ఇది నిరాశ పరిచే వార్తే అని చెప్పాలి. మహారాష్ట్రతో పాటు కేరళ రాష్ట్రంలో కూడా థియేటర్లు మూతపడబోతున్నట్టు సమాచారం.
ఇప్పుడు మళ్ళీ అక్కడ కరోనా విలయతాండవం చేస్తుంది. కేరళలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తగా మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రే.. అక్కడ ఆరోగ్య శాఖ మంత్రులతో చర్చించి కోవిడ్ ను అరికట్టే మార్గదర్శకాలను ప్రకటించినట్టు తెలుస్తుంది. ఆ ఆదేశాల ప్రకారం 50% ఆక్యుపెన్సీతో రెస్టారెంట్లు, మాల్స్, జిమ్,సెలూన్స్ వంటివి తెరుస్తారు.రాత్రి 9:45 నిమిషాల వరకు వాటికి అనుమతులు ఇచ్చారు.థియేటర్లు మాత్రం మళ్ళీ మూతపడనున్నాయి. ప్రైవేట్ కార్యాలయాలు 24 గంటలూ పనిచేస్తాయట.
గతంలో కూడా కేరళలో కరోనా కేసులు పెరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరగడం. పరిస్థితి లాక్ డౌన్ వరకు వెళ్లడం జరిగింది. దాంతో తెలుగు సినీ దర్శకనిర్మాతల్లో మళ్ళీ అలజడి మొదలైందని చెప్పాలి.ప్రస్తుతానికి అయితే తెలంగాణలో 100శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ అవుతూ ఉండగా.. ఆంద్రప్రదేశ్ లో మాత్రం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ అవుతున్నాయి.