‘ఆర్.ఆర్.ఆర్’ ఉండగా.. త్రివిక్రమ్ కు ఎన్టీఆర్ తో … సాధ్యమేనా..?

త్రివిక్రమ్ ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’ సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ బాక్సా ఫీస్ పై దండయాత్ర చేస్తూనే ఉంది. ఇప్పటికే ఈ చిత్రం 130 కోట్ల షేర్ ను రాబట్టినట్టు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే.. త్రివిక్రమ్ వచ్చే సంక్రాంతికి అంటే.. 2021 సంక్రాంతికి మళ్ళీ రావాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా ఉండబోతుందని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అక్టోబర్ లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం విడుదల కాబోతుందని సమాచారం. ఎన్టీఆర్ పార్ట్ మొత్తం మార్చి కి ఫినిష్ అయిపోతుందట. ఏప్రిల్ లేదా జూన్ నుండీ త్రివిక్రమ్ చిత్రం మొదలు పెట్టాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. పూర్తిగా జంధ్యాల స్టైల్ లో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్టు తెలుస్తుంది. ‘అరవింద సమేత’ తరువాత వీరి కాంబినేషన్లో రాబోతున్న చిత్రం కాబట్టి.. ఈ ప్రాజెక్ట్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus