వీరప్పన్… కొన్నేళ్ల క్రితం వరకు ఈ పేరు వింటే రెండు రాష్ట్రాల పోలీసుల రక్తం మరిగిపోయేది. ఈ గంధపు చెక్కల స్మగ్లర్‌ను ఎలాగైనా పట్టుకోవాలని వారు చేయని ప్రయత్నాలు లేవు. ఈ క్రమంలో వీరప్పన్ వేయని ఎత్తుగడలు లేవు. ఫైనల్లీ ఈ టామ్ అండ్ జెర్రీ ఆటకు ఎండింగ్ కార్డు పడింది. వీరప్పన్‌ను ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు. అంతకుముందు ఆయన వందలాది మంది ప్రాణాలు తీశాడు. వేల కొద్దీ గంధపు చెట్లను అక్రమంగా నరికేశాడు. ఇప్పుడు ఈ చర్చంతా ఎందుకు అంటే.. ఈ పేరు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది కాబట్టి.
ఇప్పటితరానికి వీరప్పన్ (Veerappan) గురించి అంతగా తెలియదు కానీ.. ఇంతకుముందు తరం అంటే తొంబై దశకం వాళ్లకు ఈ పేరు బాగా పరిచయం. ఆయన దందా ఏ రేంజిలో చేశాడంటే… కన్నడ స్టార్ హీరో రాజ్ కుమార్‌ను కిడ్నాప్ చేసి సంచలనం సృష్టించాడు. పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి ఆఖరికి విడిచి పెట్టాడు. ఈ క్రమంలో ఈయన మీద రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా కూడా తీశారు. అంతకుముందు కన్నడ, తమిళంలో సినిమాలు కూడా వచ్చాయి. పుస్తకాలు, నవలలు అయితే లెక్కే లేదు.
అయితే ఇప్పుడు ‘ది హంట్ ఫర్ వీరప్పన్’ పేరుతో నెట్ ఫ్లిక్స్ నాలుగు ఎపిసోడ్ల డాక్యుమెంటరీని తీసుకొచ్చింది. వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మి ఇంటర్వ్యూతో మొదలుపెట్టి… కారడవుల్లో వీరప్పన్ ఎలా బ్రతికాడు, ఎలా తప్పించుకునేవాడు లాంటి విషయాలను ఈ డాక్యుమెంటరీలో వివరించే ప్రయత్నం చేశారు. అప్పుడు కేసును డీల్ చేసిన పోలీస్ ఆఫీసర్లతో ఇందులో చాలా విషయాలు చెప్పించారు. వాటికి అప్పటి ఫోటోలు, వీడియోలు యాడ్ చేశారు.
అంతటి క్రూరంగా ఉన్న వీరప్పన్ (Veerappan) వెనుక ఉన్న ఇతర కోణాలను కూడా డాక్యుమెంటరీలో చూపించారు. ఖాకీ దుస్తుల వెనుక ఉన్న కుట్రలు, కుతంత్రాలు కూడా ఈ డాక్యుమెంటరీలో వివరించే ప్రయత్నం జరిగింది. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. తమిళనాడు, కర్ణాటక అడవుల్లో వీరప్పన్ తిరిగిన ప్రాంతాలను చూపించడమే కాకుండా… ఎంత క్రూరంగా ప్రతీకారం తీర్చుకునేవాడో కూడా వివరించారు.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!