Yash: ‘టాక్సిక్‌’ కోసం మళ్లీ ‘కేజీయఫ్‌’ బాటలో యశ్‌.. ఈసారి ఎక్కడికంటే?

‘కేజీయఫ్‌’ (KGF2)   సినిమాల తర్వాత యశ్‌ (Yash) కొత్త సినిమా ఎప్పుడు? అంటూ చాలా నెలలుపాటు అభిమానులు ఎదురుచూశారు. ఇదిగో, అదిగో అని అందరు హీరోల్లా యశ్‌ ఇబ్బంది పెట్టకుండా ‘ఇప్పుడే కాదు.. నేనే చెబుతా’ అని చెప్పి.. తన టైమ్‌ వచ్చినప్పుడు ‘టాక్సిక్‌’  (Toxic)  అనే సినిమాను అనౌన్స్‌ చేశాడు. ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌ అనే కాన్సెప్ట్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతూ మోహన్‌దాస్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి గత కొన్ని నెలలుగా హీరోయిన్‌, ఓ ప్రధాన పాత్రధారి గురించి వార్తలు వస్తూ ఉన్నాయి.

అయితే ఇప్పుడు వీటి విషయంలో క్లారిటీ వచ్చింది అనుకుంటుండగా.. సినిమా నేపథ్యం గురించి కొత్త పుకారు వచ్చింది. అదే ఈ సినిమా కూడా ‘కేజీయఫ్‌’ సినిమాల్లాగే గతంలోకి వెళ్లి చేసే సినిమానే. అంటే ఎప్పుడో జరిగింది ఇప్పుడు ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్లి చూపించడం లేదు. ఆ నాటి పరిస్థితుల్ని చూపిస్తారట. శాండిల్‌వుడ్‌ నుండి వస్తున్న సమాచారం ప్రకారం అయితే.. ‘టాక్సిక్‌’ సినిమా 1950 – 1970ల మధ్య కాలంలో జరిగే కథ అని అంటున్నారు.

దీని కోసం ప్రస్తుతం బెంగళూరు శివార్లలో నాటి వాతావరణాన్ని చూపించేలా కొన్ని సెట్లు రూపొందిస్తున్నట్లు సమాచారం. వైవిధ్యంగా రూపొందించిన ఆ సెట్స్‌లోనే సినిమా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఈ సెట్స్‌ తర్వాత లండన్‌లో భారీ షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారట. ఈ సినిమాలో యశ్‌ సరసన కియారా అడ్వాణీ (Kiara Advani) కథానాయికగా నటిస్తోంది. అలాగే నయనతార (Nayanthara) , హుమా ఖురేషీ (Huma Qureshi)  ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్లు భోగట్టా.

ఇక డ్రగ్‌ మాఫియా కథాంశంతో సినిమా తెరకెక్కనున్నట్లు టైటిల్‌ చూసి చెప్పేయొచ్చు. అయితే మరి 50ల కాలం నాటి డ్రగ్స్‌ మాఫియాను ఎలా చూపిస్తారు అనేది చూడాలి. ఎందుకంటే నేటి డ్రగ్‌ మాఫియా గురించి దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) చూపించేశారు. పాత విషయలు ఇప్పుడు గీతూ మోహన్‌దాస్‌ (Geetu Mohandas)  ఎలా వివరిస్తారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus