సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది.. ఇప్పుడు ట్రోల్సా?
- March 16, 2020 / 12:00 PM ISTByFilmy Focus
తమన్.. ప్రస్తుతం వీర ఫామ్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు ఈయన కాల్షీట్లు సంపాదించుకోవడమే దర్శకనిర్మాతలకు పెద్ద కష్టమైపోయింది. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ దగ్గర్నుండీ మొదలు పెడితే.. రవితేజ ‘క్రాక్’ , సాయి తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’, నాని ‘టక్ జగదీష్’, వరుణ్ తేజ్ – కిరణ్ కొర్రపాటి ప్రాజెక్ట్, బాలయ్య – బోయపాటి ప్రాజెక్ట్.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది..! ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కు కూడా తమన్ సంగీతమందించబోతున్నాడు అనే చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే… వరుసగా ‘వెంకీ మామ’ ‘ప్రతీరోజూ పండగే’ వంటి హిట్లు అందుకున్న తమన్ ను ఇప్పుడు ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు.

తమన్ కు ట్రోలింగ్ కొత్త కాధు. 11 ఏళ్లుగా ట్రోలింగ్ ను ఫేస్ చేస్తూనే వస్తున్నాడు. ‘కొట్టిన ట్యూన్లే మళ్ళీ మళ్ళీ కొడతాడని, తన మ్యూజిక్ లో ఎక్కువ డప్పులు సౌండ్ ఉంటుందని, ఏ.ఆర్.రెహమాన్ ట్యూన్లు లేపేస్తాడని’ అబ్బో ఇలా చాలా రకాలుగా ట్రోల్ చేశారు. అయితే వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ సినిమా నుండీ తమన్ చాలా మారాడు. అద్భుతమైన మ్యూజిక్ ఇస్తున్నాడు అని అంతా ప్రశంసించారు. కానీ ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ‘రాములో రాములా’ పాటని … 2015 లో ప్రసారమైన ‘రేలా రే రేలా’ షో నుండీ ‘యాజ్ ఇట్ ఈజ్’ లేపేసాడంటూ గత రెండు రోజుల నుండీ ఆ రెండు వీడియోలను జత చేసి ట్రోల్ చేస్తున్నారు. ఎప్పుడు తమన్ సాంగ్ రిలీజైన వెంటనే ట్రోల్ చేయడం మొదలు పెడతారు. కానీ ఈ సారి ఆ సినిమా విడుదలయ్యి బ్లాక్ బస్టర్ అయిపోయి వెళ్ళిపోయాక ట్రోలింగ్ మొదలు పెట్టారు. దీని వల్ల వారికి కలిసొచ్చేదేమిటో వారికే తెలియాలి..!
Reyyyy @MusicThaman Entraa Eee Copy Past Luuuuuuu😡😡
Indhukera @ThisIsDSP Ni Gold Anedhi pic.twitter.com/9x8BfZWOiB— నా ఇష్టం🖕 (@Infidel_KING) March 14, 2020
Most Recommended Video
యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

















