టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా భారీస్థాయిలో గుర్తింపు ఉంది. డబ్బింగ్ సినిమాల ద్వారా హిందీ ప్రేక్షకుల్లో కూడా మహేష్ బాబు భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. సర్కారు వారి పాట షూటింగ్ ను త్వరలో పూర్తి చేసి త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో మహేష్ బాబు పాల్గొననున్నారు. మరోవైపు మహేష్ బాబుకు ప్రేక్షకుల్లో అంతకంతకూ క్రేజ్ పెరుగుతోంది. ఆర్మాక్స్ మీడియా సర్వేలో గత కొన్ని నెలలుగా మహేష్ బాబు నంబర్ స్థానంలో నిలుస్తున్నారనే విషయం తెలిసిందే.
తాజాగా ఆర్మాక్స్ మీడియా అక్టోబర్ 2021కు సంబంధించిన మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జాబితాను విడుదల చేయగా మహేష్ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ జాబితాలో రెండో స్థానంలో అల్లు అర్జున్, మూడో స్థానంలో ప్రభాస్, నాలుగో స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఐదో స్థానంలో ఉండగా రామ్ చరణ్ ఆరో స్థానంలో ఉన్నారు. నాని, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, చిరంజీవి తరువాత స్థానాల్లో ఉన్నారు.
మహేష్ బాబు ప్రతి నెలలో నంబర్ వన్ స్థానంలో నిలుస్తూ సత్తా చాటుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. మహేష్ నటించబోయే త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కావడంతో ఆ సినిమాల తర్వాత మహేష్ కు క్రేజ్, పాపులారిటీ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం మహేష్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని బోగట్టా. కెరీర్ విషయంలో మహేష్ బాబు ఆచితూచి అడుగులేస్తున్నారు.