Rashmika: ఈ సారి అంతకు మించి.. వైరల్ అవుతున్ను వీడియో..!

అందాలనటి రష్మిక మందన్న మరోసారి డీప్ ఫేక్ వీడియో బాధితురాలు అయ్యారు. ఇటీవల రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ వీడియో గురించి మరువకముందే రష్మికపై మరో డీప్ ఫేక్ వీడియో తెరపైకి వచ్చింది. తాజా వీడియోలో రష్మిక జిమ్ సూట్ వేసుకుని డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో కచ్చితత్వంతో కూడిన ఫేక్ వీడియోలను రూపొందించే వెసులుబాటు ఉంది.

ఒరిజినల్ వీడియో ఉంటే తప్ప, ఫేక్ వీడియోనే నిజమైన వీడియో అని భ్రమపడేలా ఏఐ డీప్ ఫేక్ వీడియోలు ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియోపై రష్మిక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫేక్ వీడియో అని.. దీనిని ఎవరూ నమ్మొద్దని పోస్టులు పెడుతున్నారు. కొత్త సాంకేతికను దుర్వినియోగం చేస్తూ పలువురు ఆకతాయిలు ఇలాంటి డీప్‌ ఫేక్‌ వీడియోలు క్రియేట్‌ చేస్తున్నారు.

ఇటీవల సోషల్‌మీడియా తార జారా పటేల్‌ వీడియోకు (Rashmika0) రష్మిక ముఖాన్ని ఉపయోగించి వీడియో క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈవీడియోపై అమితాబ్‌ బచ్చన్‌, కీర్తిసురేశ్‌, నాగచైతన్య, విజయ్‌ దేవరకొండతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మరోవైపు కేంద్ర ఐటీ శాఖ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రష్మిక సైతం ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీని చూస్తుంటే భయంగా ఉందన్నారు. ఆ ఘటన మర్చిపోక ముందే ఆమెకు సంబంధించిన మరో మార్ఫింగ్‌ వీడియో తాజాగా వైరల్‌ కావడం సినీ తారలను కలవరపెడుతోంది. ఇలాంటి ఘటనలు జరగకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

https://twitter.com/ArjunPMO/status/1722804001937436850?s=20

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus