Virata Parvam: ‘విరాటపర్వం’ క్లైమాక్స్ మరొకరు డైరెక్ట్ చేశారా..?

  • July 2, 2021 / 09:38 PM IST

దగ్గుబాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రియమణి ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది. కానీ కరోనా కారణంగా రిలీజ్ డేట్ వాయిదా పడింది. త్వరలోనే మంచి రోజు చూసుకొని సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు వేణు ఊడుగుల అనివార్య కారణాల వలన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించలేకపోయారట. ఆయన స్థానంలో మరో దర్శకుడు ఆ బాధ్యతను తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. నిజానికి ఏప్రిల్ లో సినిమా రిలీజ్ అనుకున్నారు. రిలీజ్ డేట్ కూడా ప్రకటించడంతో టైమ్ కి పూర్తి చేయాలనే ఒత్తిడి పెరిగింది. ఆ సమయంలో వేణు ఊడుగుల అందుబాటులో లేకపోవడంతో ఆయనకు బదులుగా మరో దర్శకుడితో పతాక సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం.

అయితే ఈ విషయం బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారట. కొన్ని రోజులుగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై క్లారిటీ రావాల్సివుంది. ద‌గ్గుబాటి సురేష్ బాబు, సుధాక‌ర్‌ చెరుకూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus