Keerthy Suresh: మహానటి లిస్ట్ లో మరో డిజాస్టర్!

ఈ తరంలో మహానటి అని పిలుచుకునే కీర్తి సురేష్ ఇటీవలి కాలంలో తన మార్కెట్‌ను మెల్లగా కోల్పోతోంది. మహానటి సినిమాలో కీర్తి సురేష్ తన పాత్రకు మంచి ప్రశంసలు అందుకుంది. ఇక ఆ సినిమాలో ఆమె నటనకు జాతీయ అవార్డు కూడా అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా భారీగా రావడంతో వరుసగా లేడి ఓరియెంటెడ్ ఆఫర్స్ వచ్చాయి. అయితే స్క్రిప్ట్‌ల ఎంపిక సరిగా లేకపోవడంతో ఆమె మార్కెట్‌ను కోల్పోతున్నట్లు తెలుస్తోంది.

ఆమె ఇటీవలి చిత్రం గుడ్ లక్ సఖి డిజాస్టర్ అని ప్రకటించబడింది. ఇంతకుముందు హైదరాబాద్ బ్లూస్, దోర్, ఇక్బాల్ వంటి అద్భుతమైన చిత్రాలను అందించిన నగేష్ కుకునూర్ ఈసారి అసహ్యకరమైన స్క్రిప్ట్‌తో ముందుకు వచ్చాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అసలే సినిమాలు అడడం కష్టంగా మారిన సమయంలో ఈ స్క్రిప్ట్ పేలవంగ ఉండడంతో బెడిసికొట్టేసింది. కీర్తి సురేష్ మరోసారి డిజాస్టర్ ఎదుర్కొన్నట్లు టాక్ వస్తోంది. కీర్తి సురేష్ గత చిత్రాలైన మిస్ ఇండియా, పెంగ్విన్‌లకు కూడా ఏమంత పాజిటివ్ టాక్ రాలేదు.

స్క్రిప్ట్ లో బలం లేకపోవడం వల్లనే రిజల్ట్ తేడా కొట్టేసింది. కీర్తి సురేష్ తొందరపాటులో నాసిరకంగా స్క్రిప్ట్‌లను ఎంచుకుంటుంది, ఆమె తన కథనాన్ని నిర్ణయించే నైపుణ్యాలను కోల్పోయేలా చేస్తుందని కామెంట్స్ వస్తున్నాయి. ఎవరైనా మంచి స్క్రిప్ట్‌లను ఎంచుకోవడం ద్వారా మాత్రమే విజయం వస్తుంది. అదే వారి మార్కెట్ వాల్యుని పెంచుతుంది. ఇక కీర్తి మాత్రం ఆ విషయంలో పట్టు కోల్పోతోంది. స్క్రిప్ట్‌లను ఎంచుకునేటప్పుడు – ముఖ్యంగా పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలను ఎంచుకునేటప్పుడు ఆమె మరింత జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

లేదంటే అతి తక్కువ కాలంలోనే ఆమె మార్కెట్‌ను కోల్పోతుంది. మరి కీర్తి నెక్స్ట్ టైమ్ ఇంకా మంచి స్క్రిప్ట్‌లతో వస్తుందో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో మహానటి మేయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో రెండు తమిళ సినిమాలాతో కూడా ఈ బ్యూటీ బిజీగా ఉంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus