Chiranjeevi: మెగా అభిమానులకు చిరంజీవి అదిరిపోయే శుభవార్త ఇదే!

మెగాస్టార్ చిరంజీవికి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. రీఎంట్రీలో చిరంజీవి ఎక్కువగా రీమేక్ సినిమాలలో నటించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కొంతమంది నుంచి తీవ్రస్థాయిలో నెగిటివ్ కామెంట్లు వచ్చిన నేపథ్యంలో చిరంజీవి ఇకపై స్ట్రెయిట్ సినిమాలలో మాత్రమే నటించాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. వశిష్ట, కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లు తెరకెక్కుతున్నాయి. రీమేక్ సినిమాలు హిట్ అయినా కలెక్షన్ల విషయంలో నష్టాలను మిగుల్చుతున్న నేపథ్యంలో చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

వాల్తేరు వీరయ్య స్ట్రెయిట్ సినిమా కావడం వల్లే ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు రావడం సాధ్యమైంది. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించగా చిరంజీవి కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఈ సినిమా ఒకటిగా నిలిచిందనే సంగతి తెలిసిందే. చిరంజీవి డైరెక్ట్ గా స్ట్రెయిట్ సినిమాలలో నటిస్తానని చెప్పకపోయినా ఆయన ప్రాజెక్ట్ ల ఎంపికను గమనిస్తే ఈ విషయం సులువుగా అర్థమవుతుంది.

రీఎంట్రీలో చిరంజీవి (Chiranjeevi) మాస్ యాక్షన్ సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు యంగ్, టాలెంటెడ్ డైరెక్టర్లకు ఎక్కువగా అవకాశాలను ఇస్తున్నారు. చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లలో కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. కథ అద్భుతంగా ఉంటే మల్టీస్టారర్స్ లో నటించడానికి సైతం చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. చిరంజీవి భిన్నమైన కథలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మెగా హీరోలంతా కలిసి ఒక సినిమాలో నటిస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

మరి ఈ కాంబినేషన్ దిశగా అడుగులు పడతాయో లేదో చూడాల్సి ఉంది. చిరంజీవి స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి రాబోయే రోజుల్లో కూడా వరుస విజయాలతో సత్తా చాటుతారేమో చూడాల్సి ఉంది. చిరంజీవికి మెగా ఫ్యాన్స్ లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus