రామ్ చరణ్ శంకర్ కాంబో మూవీ 2024 సంవత్సరంలో విడుదలవుతుందని కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తైందని సమాచారం. 2023 సంవత్సరం సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. దసరా పండుగ కానుకగా ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చరణ్ వచ్చే ఏడాది శంకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ప్రస్తుతం రాజమండ్రి సమీపంలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారని బోగట్టా. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ సీన్లలో చరణ్ కు జోడీగా అంజలి కనిపించనున్నారు. చరణ్ అంజలి కాంబోలో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదేననే సంగతి తెలిసిందే. చరణ్ ఈ సినిమాలో ఒక పాత్రలో క్లాస్ లుక్ లో మరో పాత్రలో మాస్ లుక్ లో కనిపించనున్నారు. శంకర్ సినిమాతో చరణ్ కొత్త రికార్డులు క్రియేట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కెరీర్ తొలినాళ్లలో రొటీన్ రోల్స్ లో నటించిన రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో భిన్నమైన పాత్రలకు ఓటేస్తూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. చరణ్ ఈ సినిమాకు 70 కోట్ల రూపాయల స్థాయిలో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. దిల్ రాజు ఈ సినిమాతో చరణ్ ఇమేజ్ ను మరింత పెంచుతారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
దిల్ రాజు ఈ మధ్య కాలంలో తన సినిమాలను పండుగల సమయంలో విడుదల చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. చరణ్ తర్వాత ప్రాజెక్ట్ కు బుచ్చిబాబు డైరెక్టర్ కాగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వరుస సినిమాలతో చరణ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.