Nani: ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్న నాని!

నేచురల్ స్టార్ ‘దసరా’ తో హిట్ కొట్టి ట్రాక్ లోకి వచ్చాడు. ఆ సినిమా నాని కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ ను సాధించింది. ఇదిలా ఉండగా.. ఈ మధ్య నాని నటించే సినిమాల్లో ఎవరొక హీరో అతిధి పాత్రలో లేదా ముఖ్య పాత్రలో కనిపిస్తుండటం ఆనవాయితీగా మారింది. ‘జెర్సీ’ లో హరీష్ కళ్యాణ్ నటించాడు. నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమాలో ఆర్.ఎక్స్.100 హీరో కార్తికేయ నటించాడు. ‘వి’ సినిమాలో సుధీర్ బాబు, ‘టక్ జగదీష్’ లో తిరువీర్ , శ్యామ్ సింగ రాయ్ లో రాహుల్ రవీంద్రన్ , అంటే సుందరానికీ! లో సాయి రోనాక్ , దసరా లో దీక్షిత్ శెట్టి వంటి వారు నటించారు.

నాని (Nani)  నెక్స్ట్ మూవీలో కూడా ఓ హీరో కనిపించబోతున్నాడట. ‘నాని 30 ‘ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ‘వైర ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.ఈ మూవీలో నాని ఓ పాపకి తండ్రిగా కనిపించబోతున్నాడు. ‘సీతా రామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఇదిలా ఉండగా.. ఈ మూవీలో విరాజ్ అశ్విన్ అనే యంగ్ హీరో కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. త్వరలో రాబోతున్న ‘బేబీ’ సినిమాలో ఇతను సెకండ్ హీరోగా నటించాడు. గతంలో ‘థాంక్యూ బ్రదర్’ ‘మయా పేటిక’ వంటి సినిమాల్లో కూడా నటించాడు. ‘బేబీ’ మూవీతో పాటు ‘నాని 30 ‘ కూడా అతనికి మంచి పేరు తీసుకొస్తుందని ఇతను బలంగా నమ్ముతున్నాడు. విరాజ్ అశ్విన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మార్తాండ కె వెంకటేష్ కి మేనల్లుడు అవుతాడు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus