Prabhas: రన్ టైమ్ తో షాకిచ్చిన మేకర్స్.. ఆదిపురుష్ ను అంతసేపు చూస్తారా?

ఈ ఏడాది విడుదలవుతున్న ఆదిపురుష్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. దాదాపుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై నెగిటివిటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ కు దాదాపుగా రెండు నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఈ సినిమా రన్ టైమ్ లాక్ అయిందని తెలుస్తోంది.

2 గంటల 54 నిమిషాల నిడివితో ఈ సినిమా తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమా త్రీడీ, ఐమ్యాక్స్ ఫార్మాట్లలో కూడా ఈ సినిమా రిలీజ్ కానుందని బోగట్టా. కృతి సనన్ ఈ సినిమాలో జానకి పాత్రలో నటించగా సైఫ్ అలీఖాన్, సన్నీసింగ్, దేవదత్తా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీకి అజయ్ అతుల్ మ్యూజిక్ అందించారు. రిలీజ్ కు మూడు రోజుల ముందే ఈ సినిమాను ట్రిబెకా ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు.

టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. (Prabhas) ఆదిపురుష్ సినిమాకు పాజిటివ్ టాక్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆదిపురుష్ మూవీ ఏ మేరకు బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది. సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు మాత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సలార్, ప్రాజెక్ట్ కే సినిమాల బడ్జెట్ 700 కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాకు 2000 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ పెరుగుతోంది. 174 నిమిషాల రన్ టైమ్ ఫ్యాన్స్ ను భయపెడుతుండగా 150 నిమిషాల నిడివితో ఈ సినిమా విడుదలైతే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జూన్ నెల 16వ తేదీన ఈ సినిమా ఫలితం తేలిపోనుంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus