RRR Movie: పునీత్ మూవీ వల్ల ఆర్ఆర్ఆర్ కు ​ఇబ్బందేనా?

చాలా సందర్భాల్లో భారీ బడ్జెట్ సినిమాలు వేర్వేరు కారణాల వల్ల ఆలస్యంగా విడుదల కావడం జరుగుతుంది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా మాత్రం ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడింది. ఒకే రిలీజ్ డేట్ ను ప్రకటించి ఆ తేదీకి కూడా సినిమాను రిలీజ్ చేయకపోతే నెగిటివ్ కామెంట్లు వస్తాయని భావించిన ఆర్ఆర్ఆర్ మేకర్స్ తెలివిగా రెండు రిలీజ్ డేట్లను ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో అనుకూల పరిస్థితులు ఉంటే మార్చి 18వ తేదీన అనుకూల పరిస్థితులు లేకపోతే ఏప్రిల్ 28వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు.

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా ఆస్పత్రులలో చేరేవాళ్ల సంఖ్య, ప్రాణాలు కోల్పోతున్న వాళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో ఫిబ్రవరి నెలాఖరు నాటికి పెద్ద సినిమాల విడుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 18వ తేదీన విడుదల కావడం కూడా కష్టమేనని సమాచారం. గతేడాది కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ అనారోగ్య సమస్యల వల్ల మృతి చెందిన సంగతి తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా జేమ్స్ మార్చి 17వ తేదీన పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కర్ణాటకలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

జేమ్స్ పునీత్ రాజ్ కుమార్ చివరి మూవీ కావడంతో కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు మార్చి 17వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు రాష్ట్రంలో మరే సినిమాను విడుదల చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నిర్ణయం అమలైతే మాత్రం ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 18వ తేదీన రిలీజయ్యే ఛాన్స్ లేదు. తెలుగు సినిమాలకు కర్ణాటకలో ఉండే ఆదరణ అంతాఇంతా కాదు. ఆర్ఆర్ఆర్ కర్ణాటకలో సులువుగా 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించగలదు.

ఆర్ఆర్ఆర్ మేకర్స్ కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లను ఒప్పిస్తే మాత్రం మార్చి 18వ తేదీనే ఈ సినిమా కర్ణాటకలో విడుదలవుతుంది. పునీత్ రాజ్ కుమార్ కు నివాళిగా జేమ్స్ ను అన్ని థియేటర్లలో విడుదల చేయాలని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 28వ తేదీ మాత్రమే ఆర్ఆర్ఆర్ కు ఉన్న ఆప్షన్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus