Jr NTR: తెరపైకి ఆగిపోయిన ప్రాజెక్ట్.. దేవర కలెక్షన్లతో నమ్మకం పెరిగిందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR)  వార్2, డ్రాగన్ (వర్కింగ్ టైటిల్), దేవర2 (Devara) ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఈ మూడు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేవర2 సినిమా తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) డైరెక్షన్ లో నటించనున్నారని సమాచారం అందుతోంది. గతంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో ఒక సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మరీ భారీ స్థాయిలో బడ్జెట్ అవసరం కావడంతో ఆగిపోయిందని ఆప్పట్లో వార్తలు వినిపించాయి.

Jr NTR

దేవర కలెక్షన్లతో పాన్ ఇండియా స్థాయిలో తారక్ మార్కెట్ పెరిగిన నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమాల బడ్జెట్ విషయంలో మేకర్స్ అస్సలు రాజీ పడటం లేదనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో కోసం ప్రేక్షకులు సైతం ఒకింత ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత (Aravinda Sametha Veera Raghava) విడుదలై ఆరేళ్లైంది.

ఈ సినిమా అప్పట్లో శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకున్న సినిమాలలో ఒకటి. ఈ సినిమాకు సంబంధించిన హైలెట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలు ఫిక్స్ అవుతుండటం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాల కథ, కథనాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ప్రతి సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారు. సినిమాలకు అనుగుణంగా లుక్ మార్చుకుంటున్న తారక్ తన సినిమాల రేంజ్ ను పెంచడంలో సక్సెస్ అవుతున్నారు. తారక్ కెరీర్ ప్లాన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. దేవర సక్సెస్ తో తారక్ రెమ్యునరేషన్ సైతం పెరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. తారక్ తర్వాత సినిమాలు కూడా పాన్ ఇండియా హిట్లుగా నిలిస్తే ఫ్యాన్స్ సంతోషానికి అయితే అవధులు ఉండవని చెప్పవచ్చు.

గోపీచంద్ ‘విశ్వం’ 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus