Allu Arjun: హీరో బన్నీ ఖాతాలో అరుదైన రికార్డ్!

  • November 1, 2021 / 03:18 PM IST

స్టార్ హీరో బన్నీ రష్మిక మందన్నా కాంబినేషన్ లో సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి తాజాగా సామీ సామీ అనే సాంగ్ యూట్యూబ్ లో రిలీజైంది. ఈ పాట యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుండటం గమనార్హం. రిలీజైన 24 గంటల్లోనే ఈ పాటకు 9 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

ఇప్పటివరకు పాటల పరంగా హైయెస్ట్ వ్యూస్ సాధించిన పాట ఇదే కావడం గమనార్హం. గతంలో దాక్కో దాక్కో మేక సాంగ్ 8.3 మిలియన్ల వ్యూస్ సాధించగా సామీ సామీ పాట ఆ రికార్డును తిరగరాయడం గమనార్హం. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాలోని రాములో రాముల పాట సైతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది డిసెంబర్ 17వ తేదీన పుష్ప పార్ట్1 రిలీజ్ కానుంది.

భారీ బడ్జెట్ తో పుష్ప పార్ట్1 తెరకెక్కుతుండగా ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. సుకుమార్ రంగస్థలం తర్వాత ఆ స్థాయి హిట్ ను ఈ మూవీతో సాధిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బన్నీ రష్మిక కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే కాగా రష్మిక ఈ సినిమాలో డీగ్లామరస్ రోల్ లో నటిస్తుండటం గమనార్హం. మైత్రీ మూవీ మేకర్స్ ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాను నిర్మిస్తుండగా పుష్ప పార్ట్2 షూటింగ్ వచ్చే ఏడాది సెకండాఫ్ లో మొదలు కానుంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus