Pushpa in Kerala: ఫ్యాన్స్ షోస్ తో రికార్డ్ క్రియేట్ చేసిన బన్నీ!

అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప పార్ట్1 వచ్చే నెల 17వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. బన్నీకి జోడీగా ఈ సినిమాలో రష్మిక మందన్నా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పాటలు, పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్వాహకులు ఈ సినిమాకు భారీస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. కేరళలో ఈ సినిమా రిలీజ్ కాకుండానే కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుండటం గమనార్హం.

పుష్ప పార్ట్1 బన్నీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీ కాగా కేరళలో కూడా ఈ సినిమా రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజ్ కానుంది. బన్నీకి సాధారణంగానే కేరళలో అభిమానులు ఎక్కువ కాగా ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో నటిస్తుండటంతో ఫహద్ ఫాజిల్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేరళలో పుష్ప పార్ట్1కు 40 థియేటర్లలో స్పెషల్ షోస్ కోసం అడ్వాన్స్ బుకింగ్ స్టార్ అయింది. కేరళలో ఈ సినిమా 100కు పైగా థియేటర్లలో రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు తెగ వైరల్ అవుతున్నాయి. సునీల్, అనసూయ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తుండగా రిలీజైన తర్వాత పుష్ప ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus