తేజ సజ్జా (Teja Sajja) ప్రశాంత్ వర్మ (Prashanth Varma) కాంబినేషన్ లో తెరకెక్కిన హనుమాన్ విడుదలై 100 రోజులైంది. కొన్ని వారాల క్రితం ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన హనుమాన్ (Hanu Man) మూవీ ఓటీటీలో సైతం రికార్డ్ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంది. హనుమాన్ మూవీ 100 రోజులు ఆడిన థియేటర్ల లెక్క ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఏకంగా 25 కేంద్రాలలో ఈ సినిమా 100 రోజుల పాటు ప్రదర్శించబడింది. గతంలో చాలా సినిమాలు ఎక్కువ కేంద్రాలలో 100 రోజుల పాటు ప్రదర్శించబడినా ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత 25 కేంద్రాలలో ఒక సినిమా 100 రోజులు ప్రదర్శించబడటం సులువైన విషయం కాదు.
ఇప్పట్లో హనుమాన్ సాధించిన ఈ రికార్డ్ ను బ్రేక్ చేయడం చాలా పెద్ద సినిమాలకు సైతం సాధ్యం అయ్యే అవకాశం కనిపించడం లేదు. హనుమాన్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కువగా 25 కేంద్రాలలో ప్రదర్శించబడటం గమనార్హం. హనుమాన్ మూవీ సంచలనాలు ఇక్కడితో ఆగిపోయినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ప్రశాంత్ వర్మ చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నా హనుమాన్ సినిమా ద్వారా గుర్తింపు వచ్చిన స్థాయిలో మరే సినిమా ద్వారా గుర్తింపు రాలేదనే చెప్పాలి. జై హనుమాన్ సినిమాతో హనుమాన్ మూవీని మించిన సక్సెస్ ను అందుకుంటానని ప్రశాంత్ వర్మ మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సినిమాలకు సైతం సాధ్యం కాని ఎన్నో రికార్డ్ లను సాధించిన హనుమాన్ మూవీ బుల్లితెరపై కూడా క్లిక్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
జీ తెలుగు ఛానల్ ఈ సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. హనుమాన్ తేజ సజ్జా కెరీర్ కు ఎంతో ప్లస్ అయింది. తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అని ఈ కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.