చరణ్ హీరోయిన్ కూడా హ్యాండిచ్చినట్టేనా?

పాపం రాజమౌళి కి ‘ఆర్.ఆర్.ఆర్’ విషయంలో దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ‘బాహుబలి’ తరువాత మరో ‘పాన్ ఇండియన్’ తెరకెక్కించాలని భావించి ‘ఆర్.ఆర్.ఆర్’ ను మొదలు పెట్టాడు రాజమౌళి. మొదటి షెడ్యూల్ ను చాలా ఫాస్ట్ గా తెరకెక్కించి అందరినీ సర్ ప్రైజ్ చేసాడు. ఇక ప్రెస్ మీట్ కూడా పెట్టి ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని 2020 జులై 30 న విడుదల చేయబోతున్నట్టు కూడా ప్రకటించాడు. దీంతో చరణ్, ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంబరపడిపోయారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఎన్టీఆర్ సరసన చేయాల్సిన హీరోయిన్ ‘డైసీ’ ఈ చిత్రం నుండీ తప్పుకుంది. దీంతో మరో హీరోయిన్ వెతుకులాటలో జక్కన్న కిందా మీదా పడుతున్నాడు. ఇప్పుడు రెండో హీరోయిన్ అలియా కూడా జక్కన్న కు షాకిచ్చిందట.

వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం వారణాసిలో ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ లో పాల్గొంటున్న అలియా భట్ కు పేగుకు సంబంధించిన ఇన్ఫెక్షన్ వచ్చిందట. అయినప్పటికీ లెక్క చేయకుండా షూటింగ్లో పాల్గొన్న అలియాకు అక్కడున్న వేడికి ఆ సమస్య మరింత ఎక్కువయిందట.దీంతో వెంటనే ట్రీట్మెంట్ కోసం న్యూ యార్క్ వెళ్ళిపోయిందని తెలుస్తుంది. ఈ కారణంగా ‘బ్రహ్మాస్త్ర’ టీం వెనక్కు వచ్చేసిందని తెలుస్తుంది. నాగార్జున కూడా ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ పై కూడా పడింది. త్వరలో అహ్మదాబాద్ లో షెడ్యూల్ ను ప్లాన్ చేసాడట జక్కన్న. ట్రీట్మెంట్ త్వరగా పూర్తి చేసుకుని వచ్చినా.. ముందుగా ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్లో పాల్గొంటుంది. అటు తర్వాతే ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీంతో ఈ చిత్రం వచ్చే ఏడాది(2020) జులై 30 కి అయినా వస్తుందా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus