Jr NTR: యంగ్ టైగర్ అభిమానులకు మరో షాక్ తప్పదా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీకి సంబంధించిన అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా తారక్ ఫ్యాన్స్ కు మరో షాక్ తగిలే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఈ సినిమా షూట్ మొదలవుతుందని వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తలు నిజం కాదని తెలుస్తోంది. ఈ సినిమా షూట్ మరింత ఆలస్యం కానుందని వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.

ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ లో కొరటాల శివ ఎన్నో మార్పులు చేశారు. అయితే రాబోయే రోజుల్లో ఈ సినిమా స్క్రిప్ట్ ను సంబంధించి మరిన్ని మార్పులు చేసి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని కొరటాల శివ భావిస్తున్నారని సమాచారం అందుతోంది. అయితే కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్ కోసం మరీ ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తారక్, కళ్యాణ్ రామ్ ఈ సినిమా కథకు సంబంధించి చాలా సలహాలు ఇచ్చారని ఆ సలహాలను కొరటాల శివ పాటిస్తున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాలో కాంతార షేడ్స్ ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం తారక్ కొరటాల కాంబో మూవీ సెట్ కు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. కొరటాల శివ ఈ సినిమాకు 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమా బిజినెస్ వ్యవహారాలలో కొరటాల శివ జోక్యం చేసుకోవడం లేదని తెలుస్తోంది.

కొరటాల సినీ కెరీర్ లోని బెస్ట్ సినిమాలలో ఈ సినిమా ఒకటిగా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు అయితే వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus