RRR Movie: చరిత్రపై అభూత కల్పనలు వద్దంటూ పిటిషన్‌!

  • January 18, 2022 / 02:07 PM IST

అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే… ఈపాటికి ‘ఆర్ఆర్ఆర్‌’ వసూళ్ల లెక్కలు మాట్లాడుకునేవాళ్లం. కరోనా రాసిన స్క్రీన్‌ప్లే వల్ల ఆ సినిమాపై వస్తున్న లీగల్‌ విషయాలు మాట్లాడుకుంటున్నాం. మొన్నటొకటే కదా వచ్చింది అంటారా? ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై మరో పిటిషన్‌ దాఖలైంది. చిత్రపై అభూత కల్పనలు వద్దంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈసారి పిటిషన్‌ వేసింది. అల్లూరి యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు. విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు పడాల వీరభద్రరావు.

ఈ మేరకు విశాఖపట్నం జిల్లా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో ఆయన విలేఖరులకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఆర్‌ఆర్ఆర్‌’ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రను చూపించిన తీరు సరికాదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో చరిత్ర వక్రీకరణ జరిగిందని పడాల వీరభద్రరావు ఈ ప్రకటనలో ఆరోపించారు. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడిన సీతారామరాజును బ్రిటీష్‌ పోలీసుగా చూపడం దారుణమని పేర్కొన్నారు. ‘ఆర్‌ఆర్ఆర్‌’ సినిమా విషయమై సినిమా నిర్మాతలను ఉద్దేశించి ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశామని పడాల తెలిపారు.

అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ కలిసినట్టు చరిత్రలో ఎక్కడా లేదని, అలాంటిది ఆ ఇద్దరినీ కలిపి సినిమా తీయడం సరికాదన్నారు. ఈ ప్రయత్నం భావితరాలకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు చరిత్రను భ్రష్టుపట్టిస్తుందని పడాల అన్నారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలను వ్యతిరేకిస్తున్నట్టు గతంలో కొంతమంది రాజమౌళి దృష్టికి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు రాజమౌళి ‘ఆర్ఆర్‌ఆర్‌’ సినిమా కల్పిత కథ అని, స్వాతంత్య్ర పోరాటంలో ఆ మహా వీరులు ఒకవేళ కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుంది అనే కోణంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు.

అయితే ఈ మాటను కూడా పడాల వ్యతిరేకిస్తున్నారు. చరిత్రను వక్రీకరించడం తగదని చెప్పారు. ఇప్పటికైనా అల్లూరి సీతారామరాజు చరిత్రను వక్రీకరిస్తూ తెరకెక్కించిన ఘట్టాలను సినిమా నుండి వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. కొన్ని రోజుల క్రితం ఇలానే అల్లూరి సౌమ్య పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టులో దాఖలైన ఈ పిటిషన్‌పై పూర్తిస్థాయి విచారణ జరగాల్సి ఉంది. దీంతో ఇప్పటివరకు ఈ సినిమాపై పడిన పిటిషన్ల సంఖ్య రెండుకు చేరింది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!
చిరు పనైపోయిందన్నారు.. ప్లాప్ అన్నారు.. ‘హిట్లర్’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus