Balayya Babu: బాలకృష్ణ – బాబి సినిమాలో హీరోయిన్‌… ప్రచారంలోకి కొత్త పేరు

నందమూరి బాలకృష్ణ, బాబీ (కేఎస్‌ రవీంద్ర) కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే అనౌన్స్‌ అయిన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పూర్తి చేసుకుని రెగ్యులర్‌ షూటింగ్‌ దశకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో సినిమాలో కథానాయిక గురించి జోరుగా చర్చ నడుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మరోసారి ఫ్లాప్‌ హీరోయిన్‌తోనే బాలయ్య ఈ సినిమాలో రొమాన్స్‌ చేస్తాడు అని అంటున్నారు. ఏంటీ… త్రిషతోనేగా మీరు చెప్పేది అనుకుంటున్నారా? మేం చెప్పింది ఫ్లాప్‌ హీరోయినే కానీ అది త్రిష కాదు అని అంటున్నారు.

ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా సీనియర్ హీరోయిన్ త్రిష నటించనుందని వార్తలు వచ్చిన మాట వాస్తవమే. అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని సినిమా ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆ పాత్ర కోసం సినిమా టీమ్‌ మరో సీనియర్‌ హీరోయిన్‌ను కాంటాక్ట్‌ అయ్యిందట. ఆమెనే ప్రియమణి. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో ప్రియమణి అయితే ఎలా ఉంటుంది అని టీమ్‌ అనుకుంటోందట.

ఈ సినిమా బాలయ్య టైపు ఫక్తు యాక్షన్ డ్రామా కాదట. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఎమోషనల్ డ్రామా అని అంటున్నారు. అయితే టీజర్‌ లుక్‌లో అలాంటి వాసనలు అయితే ఏమీ రాలేదు. మరి ఎమోషనల్‌ డ్రామా ఎలిమెంట్‌ను ఏమన్నా దాచారేమో చూడాలి. ఈ ఎలిమెంట్‌ కారణంగానే ఈ సినిమాలోకి ప్రియమణి వస్తోంది అని అంటున్నారు. అయితే ఈ సినిమాలో కూడా బాలయ్య ఎప్పటిలాగే రెండు పాత్రల్లో కనిపిస్తాడట.

అందులో భాగంగా ఓ బాలయ్య (Balayya Babu) సరసన హీరోయిన్‌గా ప్రియమణిని తీసుకుంటే… మరో హీరోయిన్‌గా అంటే కుర్ర బాలయ్య సరసన చాందిని చౌదరిని తీసుకుంటున్నారు అని చెబుతున్నారు. ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ రావొచ్చని టాక్‌. ఇక ఫ్లాప్‌ హీరోయిన్లు అంటున్నారనేంటి అనేగా మీ డౌట్‌. త్రిషతో ‘లయన్‌’ సినిమా చేసిన బాలయ్య… ప్రియమణితో ‘మిత్రుడు’ చేశారు. ఆ రెండు సినిమాల ఫలితాలు మీకు తెలిసే ఉంటాయి.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus