Chiru – Bobby: మరోసారి సేమ్ సెంటిమెంట్.. చిరు – బాబీ ప్లానింగేంటి?
- January 20, 2026 / 05:46 PM ISTByFilmy Focus Desk
ఒకప్పుడు చిరంజీవికి ఎమోషనల్, ఫ్యామిలీ సెంటిమెంట్ కథలు పడితే నప్పవు అనేవారు. ఈ క్రమంలో కొన్ని ఫ్లాప్ సినిమాలు, వాటి ఫలితాల గురించి మాట్లాడేవారు. అలాంటి సినిమాల్లో ‘డాడీ’ ఒకటి. అందుకేనేమో చాలా ఏళ్లు అలాంటి కథల జోలికి చిరంజీవి కానీ, అతనితో సినిమాలు చేసిన దర్శకులు కానీ పోలేదు. అయితే ఇప్పుడు ఇంచుమించు అలాంటి లైన్‌తో సినిమా చేసి కెరీర్ బెస్ట్ హిట్, ఇండస్ట్రీలో నాన్ పాన్ ఇండియా హిట్ రికార్డులను చిరు బద్ధలుకొట్టారు.
Chiru – Bobby
ఈ సినిమా ఇచ్చిన దైర్యమో, లేక కథ మీద నమ్మకమో కే.ఎస్.రవీంద్ర (బాబీ) చిరంజీవితో చేయబోయే కొత్త సినిమాలకు అలాంటి లైనే సిద్ధం చేసుకున్నారట. అవును మరోసారి ఓ బిడ్డ త్రండిగా చిరంజీవి కనిపించబోతున్నారట. కూతురు సెంటిమెంట్‌తో బాబీ ఈసారి చిరంజీవిని చూపించబోతున్నారు. గతంలో ఈ ఇద్దరూ కలసి చేసిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా అన్నదమ్ముళ్ల సెంటిమెంట్‌తో వచ్చి మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే.

ఓవైపు థియేటర్లలో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమా సందడి కొనసాగుతుండగా.. ఆ ఊపులో ఉన్న చిరు కొత్త సినిమా పనులు వేగవంతం చేశారట. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే నెలలో లాంఛనంగా మొదలు కానుంది. మార్చి నుండి చిరంజీవి షూటింగ్‌కి వస్తారట. ఈ లోపు అన్ని పనులు చేసుకొని రెడీగా ఉండమని బాబీకి చెప్పేశారట. అలాగే కూతురు పాత్ర కోసం నటి ఎంపిక కూడా వేగవంతం చేశారట.
కూతురి సెంటిమెంట్, యాక్షన్ కలగిలిపన ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారని వార్తలొస్తున్నాయి. తొలుత ఆ పాత్రలో యంగ్ హీరోను అనుకున్నా.. ఆ తర్వాతీ సీనియర్ నటడు అయితేనే బెటర్ అని అనుకున్నారట. ఈ విషయాలన్నీ ముహూర్తం రోజు తేలిపోతాయి అంటున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి తీసుకురావాలని అనుకుంటున్నారట.














