Bheemla Nayak: మాస్ ప్రేక్షకులకు మరో ఆప్షన్ లేదుగా!

పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన భీమ్లా నాయక్ సినిమా తొలివారం భారీస్థాయిలో కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజైన సమయంలో వలీమై మినహా భీమ్లా నాయక్ కు థియేటర్లలో మరే సినిమా నుంచి పోటీ లేకపోవడం ప్లస్ అయింది. ఈ వారం మూడు సినిమాలు రిలీజ్ కావడంతో భీమ్లా నాయక్ కు భారీస్థాయిలో కలెక్షన్లు తగ్గుతాయని అందరూ భావించారు. హే సినామిక, ఆడవాళ్లు మీకు జోహార్లు, సెబాస్టియన్ ఈ వారం విడుదలయ్యాయి.

ఈ సినిమాలలో హే సినామికను తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఆడవాళ్లు మీకు జోహార్లు, సెబాస్టియన్ భారీ అంచనాలతో విడుదలైనా ఈ సినిమాలు భీమ్లా నాయక్ కు పోటీనివ్వడం సాధ్యం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు యావరేజ్ టాక్ వినిపిస్తుండగా ఈ సినిమా సాధించే కలెక్షన్లను బట్టి ఈ మూవీ ఫైనల్ రిజల్ట్ తేలనుంది. మరోవైపు ఈ మూడు సినిమాలు మాస్ సినిమాలు కాకపోవడం భీమ్లా నాయక్ కు ప్లస్ అవుతోంది.

శివరాత్రి పండుగ తర్వాత భీమ్లా నాయక్ కలెక్షన్లు కొంతమేర తగ్గినా శని, ఆదివారాల్లో ఈ సినిమా భారీస్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఏపీలో టికెట్ రేట్లు పెరిగి ఉంటే ఇప్పటికే భీమ్లా నాయక్ బ్రేక్ ఈవెన్ అయ్యి ఉండేదని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. భీమ్లా నాయక్ సినిమా సక్సెస్ తో పవన్ కళ్యాణ్, రానా అభిమానులు సంతోషిస్తున్నారు. హిందీలో కూడా ఈ సినిమా రిలీజవుతూ ఉండటంతో అక్కడ ఈ సినిమా సక్సెస్ సాధిస్తే పవన్ కు మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది.

పవన్ త్వరలో వినోదాయ సిత్తం రీమేక్ తో బిజీ అవుతారని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ వరుసగా రీమేక్ సినిమాల్లో నటిస్తూ ఉండటంతో పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus