Ram Charan: రామ్‌చరణ్‌ – బుచ్చిబాబు సినిమాలో రెండో నాయిక ఫిక్స్‌… ఎవరంటే?

రామ్‌చరణ్‌ – బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథ భారీగా ఉంటుంది అని టీమ్‌ చెబుతోంది. ఆ సంగతేమో కానీ ఈ సినిమా కాస్ట్‌ అండ్‌ క్రూ మాత్రం అంతకుమించి అనేలా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన లీకులు, అధికార సమాచారం ప్రకారం చూస్తే నెవర్ బిఫోర్‌ అనేలా సినిమా ఉండబోతోంది. ఇంత క్లారిటీ వస్తున్నా సినిమా హీరోయిన్‌ విషయంలో మాత్రం రావడం లేదు. అయితే ఇప్పుడు సెకండర్‌ హీరోయిన్‌ ఫిక్స్‌ అయింది అంటున్నారు.

రామ్‌ చరణ్‌ (Ram Charan) 16వ సినిమాగా రూపొందుతున్న బుచ్చిబాబు సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉంటారట. అందులో రెండో నాయికగా మీనాక్షి చౌదరిని ఓకే చేశారు అని అంటున్నారు. ఇద్దరు నాయికల పాత్రలు కీలకమే అయినప్పటికీ… మొదటి నాయిక అంటే ఆ బజ్‌ వేరు. అందుకే ఆ తొలి నాయిక ఎవరు అనే చర్చ నడుస్తూనే ఉంది. జాన్వీ కపూర్‌ పేరు ఎక్కువ కాలం వినిపించింది. అయితే ఆమె ఇంకా ప్రాజెక్ట్‌ ఓకే చేయలేదు అంటున్నారు. దీంతో మరో బాలీవుడ్‌ వారసురాల్ని తీసుకుంటారని టాక్‌.

అలా తొలి హీరోయిన్‌ విషయంలో మల్లగుల్లాలు పడిన టీమ్‌… రెండో నాయిక విషయంలో ఈజీగానే మీనాక్షిని ఓకే చేసేశారు అంటున్నారు. ఇప్పుడు ఆమె నటిస్తున్న ‘గుంటూరు కారం’లో కూడా సెకండ్‌ హీరోయిన్‌గానే చేస్తోంది. ఆ మధ్య ‘ఖిలాడీ’లో కూడా అంతే. ఇదంతా చూస్తుంటే సెకండ్‌ హీరోయిన్‌ అంటే మీనాక్షి పేరు ఠక్కున గుర్తొస్తోందేమో అనే డౌటానుమానం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

ఆ విషయం పక్కనపెడితే ఈ సినిమాలో భాగమైన వాళ్ల లిస్ట్‌ ఓసారి చూద్దాం. సంగీత దర్శకుడిగా ఏఆర్‌ రెహమాన్‌ వస్తున్నారు. ఇటీవల పోస్టర్‌ రిలీజ్‌ చేసి మరీ ఆ విషయం చెప్పారు. మరోవైపు కన్నడ నాట నుండి శివరాజ్‌ కుమార్‌ కూడా వస్తారని టాక్‌. ఇలా ప్రతి ఇండస్ట్రీ నుంచి ఓ స్టార్‌ను సినిమాలో భాగం చేసే ఛాన్స్‌ ఉంది అని అంటున్నారు. సినిమా ప్రారంభం రోజు వీటి విషయంలో క్లారిటీ వస్తుంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus