తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో బోల్డ్ పాత్రలతో గ్లామర్ రచ్చ చేసిన బ్యూటీ సిల్క్ స్మిత. 1980, 90 ల కాలంలో ఈమె గురించి తెలియని ప్రేక్షకులు ఉండరు అనడంలో సందేహం లేదు. ఈమె సినిమాల్లో ఒక్క పాట చేస్తుంది అంటేనే ఆ సినిమాపై బోలెడంత హైప్ ఏర్పడేదట. కేవలం సిల్క్ స్మిత క్రేజ్ తోనే గట్టెక్కిన సినిమాలు ఎన్నో ఉన్నాయంటే అతిశయోక్తి లేదు. అంత స్టార్ డమ్ సంపాదించుకుంది సిల్క్ స్మిత.
అయితే తర్వాత ఆమె (Silk Smitha) ఇమేజ్ ఒక్కసారిగా పడిపోయింది. అందుకు కారణాలు ఏంటి అన్నది తెలియదు. అయితే 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. అప్పటికి ఈమె వయసు కేవలం 35ఏళ్ళు మాత్రమే. అసలు ఈమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేది ఇప్పటికీ పెద్ద మిస్టరీ. ఇదిలా ఉండగా.. ‘ఎ డర్టీ పిక్చర్’ వంటి చిత్రాన్ని ఈమె బయోపిక్ గా తీసి క్యాష్ చేసుకున్నారు కానీ.. అందులో కూడా ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి బలమైన కారణం ఏంటన్నది చూపించిందిలేదు.
ఈమె ఆత్మహత్య వెనుక పెద్ద వాళ్ళ హస్తం ఉంది అనే అనుమానాలు కూడా అప్పట్లో చాలా వ్యక్తమయ్యాయి. ‘సినిమాల్లో కైపెక్కించి జనాలను మోసం చేసే పాత్రలు చేసిందేమో కానీ.. నిజ జీవితంలో సిల్క్ స్మితకు అంత తెలివి లేదు… ఎవ్వరినైనా సులభంగా నమ్మేసి మోసపోయే వ్యక్తి’.. అని చాలా మంది అంటుంటారు. ఇదిలా ఉండగా.. సిల్క్ స్మిత చనిపోయినప్పుడు చూడటానికి ఇండస్ట్రీ నుండి ఎక్కువ మంది వెళ్ళలేదట.
సిల్క్ స్మితకు అత్యంత సన్నిహితుడు అయిన రవిచంద్రన్ ఎలాగూ వెళ్ళుంటాడు అన్న సంగతి అందరూ గ్రహిస్తారు. కానీ మరో స్టార్ హీరో కూడా ఆమె చనియినప్పుడు చూడటానికి వెళ్ళాడట. అతను మరెవరో కాదు అర్జున్. ఇతనితో ఓ సినిమా నటిస్తున్న టైంలో ‘నువ్వు నా నిజమైన స్నేహితుడివి అయితే నేను చనిపోయినప్పుడు చూడటానికి వస్తావా?’ అని అడిగిందట. అందుకు అర్జున్ తిట్టినా.. సిల్క్ స్మిత చనిపోయినప్పుడు ప్రత్యేకంగా వచ్చి ఆమెకు నివాళులు అర్పించాడట.
విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?