‘రన్ వే రీల్స్’ సమర్పణలో…శ్రీనివాస్ ఆరుమిల్లి రచించి దర్శకత్వం వహించిన ‘ఓ మనిషి’ అన్న చిత్రం నిజంగా మనిషి విలువ ఏంటో కళ్ళకు కట్టినట్లు చూపించింది… ప్రస్తుత సమాజంలో అన్ని వర్గాల వారు ఎదుర్కుంటున్న భయం అనే జాడ్యాన్ని చూపిస్తూనే పిరికితనాన్నీ పక్కన పెట్టి…ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగమని చెప్పిన సందేశం నేటి తరానికే కాదు..ఆనాటి తరానికి కుండా ఒక మంచి ఆలోచనగా నిలుస్తుంది…
పంట పాడైనా రైతు…..పురుగుల మందులనే పుణ్య తీర్ధాలుగా సేవిస్తూ ప్రాణాలు కోల్పోతున్నాడు….
ప్రేమ విఫలమైన ప్రేమికులు సర్వం కోల్పోయినట్లుగా భావిస్తూ….బంగారు భవిష్యత్తుని అంతం చేసుకుంటున్నారు…
కార్పరేట్ విద్యల కోసం తమ కష్టాలను ఖర్చు పెడుతున్న తల్లితండ్రులు…తమ బిడ్డలా భవిష్యత్తును తమ పరువుగా భావిస్తూ…ఎంసెట్ లో రాంక్ రాకపోతే పిల్లలు ఇంకెందుకు పనికిరారెమొ అన్నట్లుగా భావిస్తూ ఉండడంతో భవిషత్తుకు బాటలు పరచాల్సిన ఆ పిల్లల తొలి అడుగులే భయాన్ని దరిచేర్చుకుంటూ బలవన్మరనాలకు పాల్పడుతున్నారు…అయితే సహనం కోల్పోయినా…మళ్లీ మళ్లీ ప్రయత్నించు కానీ…ధైర్యాన్ని కోల్పోవద్దు అన్న ఆలోచన రావడం…దాని రాసుకోవడమే కాకుండా..స్క్రీన్ పై ప్రెసెంట్ చేసిన తీరు నిజంగా అజరామృతం అనే చెప్పాలి…
నీ పుట్టుకే నీది కానప్పుడు నీ చావుకు నీకు హక్కు ఎక్కడ?? నువ్వు మరనిస్తే నిన్ను నమ్ముకున్న నీవాళ్లకు భవిష్యత్తు ఎక్కడా అంటూ మొదలు పెట్టిన టైటిల్ సాంగ్ నుంచి…ప్రేమలో విఫమైన వ్యక్తికి కనువిప్పు కలిగేలా ఒక మెంటలీ డిసార్దర్ పిల్లాడి ఆనందాన్ని చూపించి….అన్నీ ఉన్న వాళ్ళు చాలా మంది ఏవో కోల్పోయినట్లుగా ఉంటున్న ఈకాలంలో ఈ డిసార్డర్ పిల్లాడి ఆనందాన్ని చూస్తుంటే నిజంగా నిజమైన డిసార్డర్ అనేది అలా ఏవో కోల్పోయిన వారిలోనే ఉంటుంది అని చాలా సృజనాత్మకంగా చూపించారు….
చివరిగా….ఈ కధ…రకరకాల ఇబ్బందులతో…సతమతమవుతున్న ఎంతో మంది ధైర్యంతో భయాన్ని వదిలేసి…భవిష్యత్తు మార్గాలను వెతుక్కోవాలి అని తెలిపే కధ….ఈ ప్రయత్నానికి…హ్యాట్సాఫ్ చెబుతున్నాం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.