Actress: నెటిజన్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఊపిరి నటి!

ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, అతడి ప్రేయసి హాట్ మోడల్ అయిన గాబ్రియల్లాతో కోనేళ్ళుగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. తన మొదటి భార్య మెహర్ తో దాదాపు 20 ఏళ్ల బంధాన్ని తెంచుకుని ఆమె నుంచి 2018లో విడాకులు పొందారు. అప్పటి నుంచి అర్జున్ రాంపాల్ గాబ్రియల్లాతో డేటింగ్ చేస్తున్నాడు. గాబ్రియల్లా గురించి చెప్పాలంటే ఆమె సౌత్ ఆఫ్రికాకి చెందిన మోడల్. ఇండియాలో మోడలింగ్ లో రాణిస్తూ నాగార్జున ఊపిరి చిత్రంలో అవకాశం అందుకుంది.

ఆ మూవీలో ఓ డ్యాన్స్ సీన్ లో గాబ్రియల్లా (Actress) మెరిసింది. అయితే అర్జున్ రాంపాల్ తో ఆమెకి అనుకోకుండా పరిచయం ఏర్పడడం.. ప్రేమలో పడడం జరిగింది. ఈ జంట ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. సహజీవనం చేస్తూనే ఆరిక్ రాంపాల్ అనే కొడుకుని కన్నారు. తాజాగా మరోసారి గాబ్రియల్లా గర్భవతి అయింది. ప్రస్తుతం గాబ్రియల్లా నిండు గర్భిణి. తన ప్రెగ్నన్సీకి సంబంధించిన ఫొటోస్ ని తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. బేబీ బంప్ తో ఉన్న పిక్స్..

ప్రియుడు రాంపాల్, కొడుకుతో సరదాగా గడుపుతున్న పిక్స్ ని షేర్ చేస్తోంది. అయితే చాలా కాలంగా వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని నెటిజన్లు చర్చించుకుంటూనే ఉన్నారు. తాజాగా గాబ్రియల్లా బేబీ బంప్ పిక్స్ షేర్ చేయగా ఓ నెటిజన్ ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేశారు. ‘అసలు మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు.. నువ్వు ఉంటోంది విదేశాల్లో కాదు ఇండియాలో..

మీరు యువతని చెడగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టింది. అతడికి గాబ్రియల్లా ధీటుగా సమాధానం ఇచ్చింది. అవును నిజమే మేము తప్పు చేస్తున్నాం.. నీ లాంటి ఉన్మాదులకు జన్మనివ్వకుండా అందమైన చిన్నారులకు జన్మనివ్వడం మేము చేస్తున్న తప్పు’ అంటూ చురకలంటించింది.


ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus