Ooru Peru Bhairavakona Trailer Review: ‘ఊరు పేరు భైరవకోన’ ట్రైలర్ వచ్చేసింది.. మరో ‘విరూపాక్ష’ అవుతుందా?

ఫాంటసీ టచ్ ఉన్న సినిమాలకి మంచి డిమాండ్ ఉంది అని గతేడాది ‘విరూపాక్ష’, ఈ ఏడాది ‘హనుమాన్’ తో ప్రూవ్ అయ్యింది. మధ్యలో ‘పొలిమేర 2 ‘ కూడా వచ్చి సక్సెస్ అందుకుంది. ఇక ఇప్పుడు మరో ఫాంటసీ మూవీ రాబోతుంది అదే ‘ఊరు పేరు భైరవకోన’. సందీప్ కిషన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వర్ష బొల్లమ, కావ్య థాఫర్ హీరోయిన్లుగా నటిస్తుండగా, వైవా హర్ష వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

‘సామజవరగమన’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత రాజేష్ దండా దీనిని నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి సూపర్ హిట్ ను అందించిన వి ఐ ఆనంద్ దర్శకుడు. ఫిబ్రవరి 9 న ఈ సినిమా విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.1 :55 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.

గ‌రుడ పురాణం నేప‌థ్యం, క‌ర్మ సిద్ధాంతం వంటి థీమ్ తో ఈ మూవీ (Ooru Peru Bhairavakona) రూపొందినట్టు స్పష్టమవుతుంది. ‘భైరవకోన’ అనే ఊరిలో జరిగే కథ అని కూడా ట్రైలర్ తో క్లారిటీ ఇచ్చేసారు. ప్రేయసి కోసం హీరో చేసే విన్యాసాలు ప్రధానంగా ట్రైలర్ లో కనిపించాయి . విజువల్స్ కూడా బాగున్నాయి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయేమో అనే భరోసా ఇచ్చింది ఈ ట్రైలర్. కొంచెం ‘విరూపాక్ష’ షేడ్స్ కనిపించినా … కథనం వేరుగా ఉంటుంది అని స్పష్టమవుతుంది. ఇక ఈ ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus