Operation Valentine: ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ కష్టాలు… షూటింగ్‌ కోసం ఇంత కష్టపడ్డారా?

  • February 28, 2024 / 02:29 PM IST

సినిమా చిత్రీకరణ అంటేనే వందల మంది కష్టం. అందులోనూ యాక్షన్‌ మూవీ అయితే ఇంకా ఎక్కువ. యుద్ధం నేపథ్యంలో తెరకెక్కే సినిమా అంటే ఆ సంఖ్య వేలల్లోకి వెళ్లిపోతుంది. అలా ఇప్పుడు తెరకెక్కిన పాన్‌ ఇండియా సినిమా ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. వరుణ్‌ తేజ్‌, మానుషి చిల్లార్‌ జంటగా తెరకెక్కిన ఈ సినిమాను శక్తిప్రతాప్‌ సింగ్‌ తెరకెక్కించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా వరుణ్‌ తేజ్‌ మీడియాతో మాట్లాడుతూ షూటింగ్‌ జరిగిన విధానం గురించి మాట్లాడాడు. దీంతో సినిమా కోసం ఇంత కష్టపడ్డారా అనే చర్చ జరుగుతోంది.

పైలట్‌ని మొదట ఓ స్టిములేటర్‌లో కూర్చోబెట్టి అవగాహన కల్పిస్తారు. అందులో ఉంటే ఫ్లైట్‌ నడుపుతున్నట్టే ఉంటుంది. అలా ఈ సినిమా కోసం వరుణ్‌ సిమ్యులేటర్‌లోనే కూర్చుకున్నారట. పాత్ర కోసం నేను సన్నద్ధం కావడం ఒకెత్తైతే, ఈ సినిమా చిత్రీకరణ సాగిన విధానం మరో ఎత్తు అంటున్నారు. ఎయిర్‌బేస్‌లో నియమాలు కఠినంగా ఉంటాయని, ఫోన్లు, ఫొటోగ్రఫీకి అనుమతి ఉండదని తెలిపారు. వాళ్లు చెప్పినట్టుగా ఉదయం 8 లోపు అందరూ వెళ్లాలి. మళ్లీ సాయంత్రం అందరూ ఒకేసారి తిరిగి రావాలి. అలానే చేశామని తెలిపారు.

విమానం (Operation Valentine) లోపల కూర్చుంటే అంతగా శబ్ధం రాదు కానీ, బయట ఎక్కువ. ఫైటర్‌ జెట్‌ల శబ్ధం మామూలుగా విమానాల కంటే 20 శాతం ఎక్కువ. అలాంటి ఫైటర్‌ జెట్లు అక్కడ రోజూ 40 ల్యాండ్‌ అయ్యేవి. జరిగేవి. జెట్‌ రెండు కి.మీ. దూరంలో ఉన్నా సెట్‌లో ఒకరిమాటలు మరొకరికి వినిపించవు. అలా 40 రోజులపాటు చిత్రీకరణ చేశామని తెలిపారు వరుణ్‌. ఆ ఫలితం ఇప్పుడు వెండితెరపై చూస్తామని తెలిపారు.

పుల్వామా దాడులు, బాలాకోట్‌ ఎయిర్‌ స్ట్రైక్‌ నేపథ్యంలో దాదాపు 14 కథలు వచ్చాయని, అయితే వైమానిక దళం అధికారులతో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్లూ అదే చెప్పారట. కానీ కథని నమ్మి ముందుకెళ్లాం. బాలాకోట్‌ దాడులకు సంబందించి మా వివరణ ఈ సినిమాలో ఉంటుంది. వైమానిక దళం మాట్లాడే సాంకేతిక పరమైన మాటలకి అర్థం వెనుక భావోద్వేగం బలంగా ఉంటుంది. అది కనెక్ట్‌ అయ్యేలా సినిమా చేశామని చెప్పారు.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus