‘ఒప్పం’ రీమేక్ కి రంగం సిద్ధం..?

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఒప్పం’. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్ లాల్ అంధుడి పాత్రలో నటించారు. ప్రేక్షకుల స్పందన ఎలా ఉన్నా చిత్ర వర్గాల్లో మాత్రం ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. రీమేక్ చేయడానికి పలువురు అగ్ర నటులు ఆసక్తి చూపుతుండటం విశేషం.ప్రియదర్శన్ రజనీకి ప్రత్యేకంగా ఈ సినిమా చూపించడం, ఆయన అభినందించడం తెలిసిందే. తమిళ్ రజనీ ఈ సినిమా రజనీ రీమేక్ చేయడానికి ఈ సన్నాహాలన్నీ. అయితే ఇక్కడే కథ యు టర్న్ తీసుకుంది.

కాలికి శస్త్ర చికిత్స కారణంగా ‘శభాష్ నాయుడు’ సినిమా షూటింగ్ ని పక్కన పెట్టిన కమల్ చేయాల్సిన సినిమాల స్క్రిప్ట్ పనులు చక్కబెడుతున్నారట. ఆ మధ్యలో ‘ఒప్పం’ సినిమా చూసిన కమల్ తమిళంలో రీమేక్ చేయాలన్న ఆలోచనకి వచ్చారట. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్టు చెన్నై వర్గాల సమాచారం. మరోవైపు ఈ సినిమా బాలీవుడ్ కూడా పయనమవనుందిట. ఇటీవల రియలిస్టిక్ సినిమాలతో వరుస విజయాలు అందుకుంటున్న అక్షయ్ కుమార్ ఇందులో నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రియదర్శన్-అక్షయ్ ‘కట్టా మీటా’ చిత్రం కోసం కలిశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus