Ticket Price Hikes: 90 రోజుల నిబంధన.. అంత కష్టమేమీ కాదు.. ఇలా ప్లాన్ చేస్తే…
- January 21, 2026 / 03:17 PM ISTByFilmy Focus Desk
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల పెంపునకు చాలా పెద్ద ఇబ్బందులు ఉండేవి. అప్పటి వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు ససేమిరా ఒప్పుకునేది కాదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం – బీజేపీ – జనసేన కూటమి ప్రభుత్వం సినిమా పరిశ్రమ విషయంలో ఎంతో అభిమానంతో ఎలాంటి సినిమాకైనా నిబంధనలు లేకుండదా టికెట్ రేట్ల పెంపు ఆప్షన్ ఇచ్చింది. అయితే ఇప్పుడు సమస్య తెలంగాణలో వచ్చింది. సినిమాలకు టికెట్ రేట్ల పెంపునకు ఇటు ప్రభుత్వం, అటు కోర్టులు మధ్య బంతి తిరుగుతూ తిరుగుతూ ఏకంగా పెంపు లేకుండా అయిపోయింది.
Ticket Price Hikes
అయితే, తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చూస్తే.. ఏదైనా సినిమాకు టికెట్ రేట్ల పెంపు కావాలంటే 90 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలి. దానిని పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఇన్ని రోజుల ముందు దరఖాస్తు చేసుకోవడం అసాధ్యం అంటున్నారు. ఎందుకంటే సినిమా విడుదలకు అన్ని రోజుల ముందే ఫైనల్ నిర్ణయం తీసుకోవడం మన దగ్గర అసాధ్యం. ఎప్పుడో ఏదో ఒకసారి మాత్రమే ఇలా జరిగింది. అంతా ఓకే అని జీవో తెచ్చుకున్నాక ఆ రోజుకు సినిమా రాకపోతే మరోసారి జీవో కోసం ప్రభుత్వం వద్దకు వెళ్లాలి. ఇది పెద్ద ప్రహసనమే.
దీనికి సొల్యూషన్ ఏంటా అని చూస్తే.. రెండు అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి సినిమా పరిశ్రమ చేతుల్లో ఉంటే, రెండో ప్రభుత్వం చేతుల్లో ఉంది. తొలుత సినిమా పరిశ్రమ సంగతి చూస్తే.. సినిమాను తొలుత అనుకున్నట్లుగా చెప్పిన తేదీకి విడుదల చేయడానికి ప్రయత్నం చేయాలి. మరీ తప్పనిసరి పరిస్థితుల్లో తేదీ మార్పుల చేయాలి. దీని వల్ల సినిమా బడ్జెట్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. ఇది పరిశ్రమకు చాలా మంచిది కూడా.
ఇక రెండో పాయింట్ విషయానికొస్తే.. సినిమా టికెట్ల పెంపు జీవోలో ప్రభుత్వం విడుదల తేదీ నుండి ఇన్ని రోజుల వరకు వర్తిస్తుంది అని పర్టిక్యులర్‌గా రిలీజ్ డేట్ పెట్టకుండా పేర్కొనాలి. ఇది నిబంధనల ప్రకారం ఎంతవరకు ఓకే అవుతుంది అనేది చూడాలి. ఇదే జరిగితే అప్పుడు పెంపు అవసరం అని కోరుకునే నిర్మాతలు 90 రోజుల ముందే అప్లై చేసుకుంటారు. మరి ఈ రెండింటిలో ఏమవుతుందో చూడాలి.










