Prabhas : ప్రభాస్ మూవీ అడిషన్స్ క్యాన్సిల్.. ఎందుకంటే?

స్టార్ హీరో ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కె వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 500 కోట్ల రూపాయలు అని సమాచారం. మహానటి తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో నాగ్ అశ్విన్ ఫ్యాన్స్ సైతం ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో దీపికా పదుకొనే నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ వల్ల పలు రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు. ప్రాజెక్ట్ కె మూవీ అడిషన్స్ కు సంబంధించి కొన్నిరోజుల క్రితం ఒక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నెల 15వ తేదీన కొచ్చిలో జరగాల్సిన అడిషన్స్ ను రద్దు చేసినట్టు ఈ సినిమాను నిర్మిస్తున్న వైజయంతీ మూవీస్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కరోనా నిబంధనల వల్ల మూవీ అడిషన్స్ క్యాన్సిల్ అయ్యాయి.

చెన్నై, బెంగళూరులో అడిషన్స్ ను పూర్తి చేసిన చిత్రయూనిట్ కొచ్చిలో మాత్రం ఎప్పుడు అడిషన్స్ జరుపుతామో తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది. టైమ్ ట్రావెల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రభాస్ ఈ సినిమాతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ సినిమాలో, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ సినిమాలో నటిస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తైన విషయం తెలిసిందే.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus