మన హీరోలకు తెలుగు హిట్‌ డైరక్టర్లు దొరకడం లేదా?

పొరుగింటి పుల్లగూర రుచి అనే నానుడి సినిమా పరిశ్రమకు బాగా సూటవుతుంది అంటుంటారు మన పెద్దలు. హీరోయిన్లు, విలన్లు, దర్శకులు.. ఇలా అందరినీ పొరుగింటి నుండి తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ఇతర భాషల నుండి దర్శకులు రావడం ఎక్కువైంది. ప్రస్తుతం టాక్స్‌లో ఉన్న సినిమాలు, అనౌన్స్‌ అయిన సినిమా లిస్ట్‌ చూస్తుంటే పొరుగు దర్శకుల జోరు మన ఇండస్ట్రీలో ఊపందుకున్నట్లు అర్థమవుతోంది. ఇతర ఇండస్ట్రీల నుండి మన దగ్గరకు దర్శకులు రాకూడదని ఏమీ లేదు. మనవాళ్లు కూడా అక్కడికి వెళ్తుంటారు.

అయితే వరుసగా అదే దర్శకుల సినిమాలు ఓకే అవుతుండటం ఇక్క చర్చించుకోదగ్గర విషయం. ఇటీవల కాలంలో మన దగ్గర ఓకే అయిన సినిమాల దర్శకులు చూస్తే ఈ విషయం మనకు అర్థమైపోతుంది. ప్రశాంత్‌ నీల్‌, శంకర్‌, లింగుస్వామి, లోకేశ్‌ కనగరాజ్‌, మురుగదాస్‌, విక్రమ్‌ ఇలా జాబితా తయారవుతోంది. తెలుగులో హిట్‌ సినిమాలు చేయడానికి తమిళ, కన్నడ, మలయాళ కథలు తీసుకుంటున్నాం. హీరోయిన్లుగా అక్కడి అమ్మాయిలను తెచ్చుకుంటున్నాం. విలన్‌గా అక్కడి వాళ్లనే అప్పు తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు దర్శకులు కూడా అక్కడి నుండే.

ఆ దర్శకులు అక్కడ మంచి హిట్లు ఇచ్చి ఉండొచ్చు. హీరోలకు మాస్‌ ఎలివేషన్లు, సీన్స్‌ రాసి ఉండొచ్చు. అలా అని మన దగ్గర అలాంటివాళ్లు లేరా? లేక అక్కడి దర్శకులు అయితేనే మన హీరోలు సినిమాలు చేస్తాం అని డేట్స్‌ ఇస్తున్నారా? ఏమో మరి నిర్మాతల ఆలోచన ఎందుకు ఇతర సినీ పరిశ్రమల దర్శకులవైపే తిరుగుతోందో అర్థం కావడం లేదు. దిల్ రాజు 50వ సినిమా కాబట్టి పెద్ద దర్శకుడు – హీరో కాంబినేషన్‌ కావాలని శంకర్‌ను తీసుకున్నారు. ‘కేజీఎఫ్‌’ లాంటి హిట్‌ ఇచ్చిన దర్శకుడు కాబట్టి ప్రశాంత్‌ నీల్‌కు మన నిర్మాతలు వరుస అడ్వాన్స్‌లు ఇస్తున్నారు. ‘మాస్టర్‌’ వంటి మాస్టర్‌ పీస్‌ తీశాడు కాబట్టి లోకేశ్ కనగరాజ్‌కు మైత్రీ వాళ్లు భారీ అడ్వాన్స్‌ ఇచ్చారు.

లింగుస్వామి చెప్పిన ఫ్యాక్షన్‌ – పోలీసు కథ నచ్చింది కాబట్టి రామ్ ఓకే చేశాడు. మురుగదాస్ సోషల్‌ మెసేజ్‌ ఉన్న కథ బాగా తీస్తాడు కాబట్టి ఆయన కథను మనవాళ్లు వింటున్నారు. విక్రమ్‌ వరుసగా తెలుగు సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ఆయనకు నాగార్జున అండ్‌ కో అవకాశం ఇచ్చింది. వైవిధ్యమైన సినిమా చేయాలి కాబట్టే గిరీశయ్యకు వైష్ణవ్‌ తేజ్‌ అవకాశం ఇచ్చాడు. ఇలా మనం కారణాలు చెప్పుకోవచ్చు కానీ అలాంటి కథలు, దర్శకులు మన దగ్గర లేరా అంటే చాలామంది ఉన్నారనే చెప్పుకోవాలి. కానీ టాలీవుడ్‌ ఇలా ఎందుకు చేస్తోంది అంటే ఏమో మరి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus