మారుతున్న థియేటర్ బిజినెస్.. మల్టీప్లెక్స్ స్క్రీన్స్ కూడా ఎగిరిపోతున్నాయి?

ఓటీటీ (OTT) ప్రభావం రోజురోజుకూ థియేటర్ రంగాన్ని గట్టిగా పట్టిపీడిస్తోంది. లేటెస్ట్ స్టడీస్ ప్రకారం.. రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ స్క్రీన్ల సంఖ్య 30 నుంచి 50 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా షాపింగ్ మాల్స్‌లో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్లు తక్కువ లాభదాయకంగా మారుతున్నాయని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. దీనివల్ల రియల్ ఎస్టేట్ డెవలపర్లు థియేటర్లకు భద్రపరిచిన స్థలాన్ని వేరే బిజినెస్ అవసరాలకు కేటాయించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

OTT

సినిమా థియేటర్‌కు వెళ్లాలి అంటే టైమ్, టికెట్, ట్రావెల్ ఖర్చులు అన్నీ కలిసి పెద్ద వ్యయంగా మారుతున్నాయి. అదే ఇంట్లో ఓటీటీ యాప్‌లతో కూర్చొని బిగ్ స్క్రీన్ అనుభూతిని పొందే వీలుండటంతో, ఆడియన్స్ థియేటర్ వరకు రావాలనే ఉత్సాహం చూపడం లేదు. ముఖ్యంగా మిడ్‌రేంజ్ సినిమాలకు ఇది పెద్ద మైనస్‌గా మారుతోంది. ఈ ట్రెండ్‌ వల్ల థియేటర్ల వసూళ్లు గణనీయంగా పడిపోతున్నాయి.

తాజాగా వెలువడిన రిపోర్టుల ప్రకారం, ఫుడ్ కోర్ట్‌లు, షాపింగ్ స్టోర్లు, కిడ్స్ జోన్ లాంటి విభాగాలకు డిమాండ్ పెరుగుతున్నందున, మాల్స్ యాజమాన్యం సినిమా హాల్స్‌కు కేటాయిస్తున్న స్పేస్‌ను దశలవారీగా తగ్గించే అవకాశముందని అంటున్నారు. ఇకపై పెద్ద తెరపై సినిమా చూడాలన్న అనుభూతి నెమ్మదిగా ఓ లగ్జరీగా మిగిలిపోతుందన్న భావన మరింత బలపడుతోంది. అయితే దీనికి ప్రతిస్పందనగా థియేటర్ రంగం కూడా మారాలని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు.

వినూత్నమైన టికెట్ ధరల ఆఫర్లు, లైవ్ షోస్, ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్, స్పెషల్ థీమ్ స్క్రీనింగ్‌లకు ప్రాధాన్యం పెడుతూ ప్రేక్షకుల నడక మళ్లించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. లేకపోతే త్వరలోనే థియేటర్లు, ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లు, తక్కువ స్క్రీన్లతోనైనా కొత్త మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి తప్పదంటున్నారు.

కార్తీక్ సుబ్బరాజ్ రెట్రో.. తెలుగు ప్రేక్షకులకు ఈసారి కనెక్ట్ అవుతాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus