Retro: కార్తీక్ సుబ్బరాజ్ రెట్రో.. తెలుగు ప్రేక్షకులకు ఈసారి కనెక్ట్ అవుతాడా?

సూర్య (Suriya) హీరోగా, కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj)   దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా రెట్రో (Retro) ఇప్పుడు థియేటర్ల విడుదలకు రెడీ అవుతోంది. మే 1న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌కు అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వస్తున్నా, తెలుగు ఆడియన్స్ నుంచి మాత్రం మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. ట్రైలర్ చూస్తేనే స్టోరీ కాంప్లెక్స్ గా అనిపించడంతో పాటు, ఎమోషన్ లెవెల్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు.

Retro

ముఖ్యంగా కార్తీక్ సుబ్బరాజ్ స్టైల్ ఇక్కడి ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాకపోవడం ఇది వరకూ ఎన్నోసార్లు స్పష్టమైంది. ‘పెటా’ (Petta), ‘మహాన్’, ‘జిగర్తాండ డబుల్ ఎక్స్‌’ (Jigarthanda DoubleX) సినిమాల విషయంలో అదే జరిగింది. పక్కాగా థాట్స్‌తో నడిచే కథలు, మంచి విజువల్స్, వయోలెన్స్ బేస్డ్ సీన్స్ ఉండడంతో సాధారణ ప్రేక్షకులకు నచ్చక కాకపోయినా, సుబ్బరాజ్ స్టైల్‌కి ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ మాత్రం ఉంది. ఈసారి ‘రెట్రో’ ట్రైలర్ చూస్తే మాత్రం.. సూర్య పాత్రకు బలమైన బ్యాక్‌డ్రాప్, నాటకీయ మలుపులు ఉన్న కథ అని తెలుస్తోంది.

పూజా హెగ్డే  (Pooja Hegde) అందంతో పాటు నటనలోనూ బాగానే హైలెట్ అయ్యింది. ఆర్ట్ డిజైన్, కెమెరావర్క్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ మాస్‌కు కనెక్ట్ అయ్యేలా ఉన్నప్పటికీ, కథ స్క్రీన్ ప్లే ఎలాంటి ఫీల్ ఇస్తుందనేది మాత్రం అసలు సినిమాతోనే తేలనుంది. అయితే కోలీవుడ్‌లో మాత్రం రెట్రోపై పాజిటివ్ బజ్ నెలకొంది. కార్తీక్ సుబ్బరాజ్ కల్ట్ ఫాలోయింగ్ ఉన్న కారణంగా, సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వస్తాయని ట్రేడ్ వర్గాల అంచనా.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ట్రైలర్ రేంజ్‌ను బట్టి నెగెటివ్ స్పేస్‌లో డిబేట్ స్టార్ట్ కావడం గమనార్హం. ఇప్పటివరకు తెలిసిన వివరాల ప్రకారం రెట్రో ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని మాత్రం చెప్పొచ్చు. అయితే తెలుగు ప్రేక్షకుల మనసులను గెలవాలంటే కంటెంట్ ఎంత క్లియర్‌గా కమ్యూనికేట్ అవుతుందన్నదే కీలకం. మరి మే 1న ‘రెట్రో’ తెలుగు బాక్సాఫీస్‌ను ఏ విధంగా కదిలిస్తుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus