2023 సంక్రాంతి బాక్సాఫీస్ వార్‌కి సర్వం సిద్ధమవుతోంది.. ప్రభాస్ ‘ఆదిపురుష్’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’, విజయ్ ‘వారసుడు’, అజిత్ ‘తునివు’ లాంటి డబ్బింగ్ సినిమాలు.. ఇవి చాలవన్నట్టు మధ్యలో అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’.. ఇలా పెద్దపండక్కి థియేటర్లు దొరుకుతాయో, లేదో అనుకుంటుండగా.. ‘ఆదిపురుష్’ వెనక్కి తగ్గింది.. మన దగ్గర చిరు, బాలయ్య సినిమాల మధ్యే మెయిన్ పోటీ.. సీజన్‌ని క్యాష్ చేసుకోవడానికి డబ్బింగ్ బొమ్మలు కూడా రెండు దిగుతున్నాయి..
తెలుగులో మెగాస్టార్, నటసింహ ఫ్యాన్స్, మూవీస్ మధ్య వాతావరణం ఎలా ఉంటుందో.. తమిళనాట అజిత్, విజయ్ సినిమాల మధ్య, ఫ్యాన్స్ మధ్య కూడా అలాంటి పోటీనే.. ఒకరకంగా చెప్పాలంటే అంతకు మించే ఉంటుంది.. విజయ్ సినిమాకి దిల్ రాజు నిర్మాత కాబట్టి థియేటర్లకు ప్రాబ్లమ్ లేదు.. అజిత్ మూవీకి చాలా తక్కువే ఇస్తారు. ఇక చిరు, బాలయ్య సినిమాలకు ఒకటే నిర్మాణ సంస్థ కాబట్టి.. స్క్రీన్స్ అడ్జెస్ట్‌మెంట్ అనేది వాళ్లే తేల్చుకోవాలి..
ఇక పండక్కి రాబోతున్న ఈ నాలుగు చిత్రాలకు సంబంధించిన ఓవర్సీస్ బిజినెస్ డీల్ కూడా ముగిసింది.. ఏ సినిమా ఎంత బిజినెస్ చేసింది.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..
వారిసు..
ఇళయ దళపతి విజయ్, వంశీ పైడిపల్లి కాంబోలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ అక్షరాలా రూ.35 కోట్లకు అమ్మారు.. విజయ్‌ని తెలుగుకి తీసుకొచ్చి దాదాపు 100 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారని అంటున్నారు. తమిళ్ వెర్షన్ ఒకటే ఈ రేట్ అంటే గ్రేటే మరి..
తునివు..
‘అల్టిమేట్ స్టార్’, ‘తల’ అజిత్ కుమార్ వరుసగా ఆరు హిట్లతో డబుల్ హ్యాట్రిక్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ‘తునివు’ ఓవర్సీస్ హక్కులు రూ.13 కోట్లకు అమ్ముడయ్యాయి..
వాల్తేరు వీరయ్య..
మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత తనకి కొట్టిన పిండి అయినటువంటి మాస్, కమర్షియల్ జానర్‌లో చేస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ రైట్స్ రూ. 8.5 కోట్లు పలికాయి..
వీర సింహా రెడ్డి..
నటసింహ నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ బ్లాక్ బస్టర్ తర్వాత నటించిన ‘వీర సింహా రెడ్డి’ మీద భారీ అంచనాలున్నాయి.. ఈ మూవీ ఓవర్సీస్ బిజినెస్ రూ.5.5 కోట్లకు క్లోజ్ చేశారు..