Rakul Preet: రాఖీ పండుగ రోజే తమ్ముడు చేతిలో తన్నులు తిన్న రకుల్!

ప్రతి ఏడాది రాఖీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఈ రాకి వేడుకను ఎంతో ఘనంగా కుల మతాలకు అతీతంగా అక్క చెల్లెలు వారి అన్నదమ్ములకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలుపుతారు. ఇకపోతే ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీ మధ్యాహ్నం నుంచి 12వ తేదీ ఉదయం వరకు ఈ పండుగను జరుపుకుంటారు. ఇకపోతే రాఖీ పండుగ సందర్భంగా సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు పెద్ద ఎత్తున తమ సోదరులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ క్రమంలోనే నటీ రకుల్ ప్రీతిసింగ్ మాత్రం తన తమ్ముడికి రాఖీ కట్టి ఆశీర్వదించకుండా ఏకంగా తన తమ్ముడి చేతిలో తన్నులు తిన్నారు.ఇలా పండుగ రోజే వీరిద్దరూ టామ్ అండ్ జెర్రీ నేపథ్యంలో ఒకరినొకరు కొట్టుకున్న వీడియోని ఈమె షేర్ చేశారు. ఇంతకీ వీళ్లిద్దరూ ఎందుకు గొడవపడ్డారనే విషయానికి వస్తే… ఈ వీడియోలో భాగంగా వీరిద్దరూ ఓ చాలెంజ్ పెట్టుకొని గొడవ పడినట్లు తెలుస్తోంది. ఈ ఛాలెంజ్ లో భాగంగా ముందుగా వాటర్ తాగి వన్ టూ త్రీ అంటూ చేతివేళ్లను చూపించాలి.

ఈ ఛాలెంజ్ లో భాగంగా ముందుగా రకుల్ ప్రీతిసింగ్ తమ్ముడు ఓడిపోవడంతో ఈమె తనపై చేయి చేసుకుంది.తరువాత రౌండ్ లో భాగంగా రకుల్ ప్రీతిసింగ్ ఓడిపోవడంతో ఆమె సోదరుడు రకుల్ చెంప చెల్లుమనిపించాడు. అయితే రకుల్ సోదరుడు తనని బాగా గట్టిగా కొట్టినట్లు ఆమె ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ విధంగా వీళ్ళిద్దరూ పండగ పూట తన తమ్ముడికి రాఖీ కట్టి ఆశీర్వదించకుండా ఇలా చాలెంజ్ పేరిట ఒకరినొకరు బాగా కొట్టుకున్నారు.

ప్రస్తుతం ఈ వీడియోని రకుల్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.ఇకపోతే రకుల్ ప్రీతిసింగ్ ప్రస్తుతం తెలుగులో ఎలాంటి సినిమాలలో నటించలేదు అయితే ఈమె కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 సినిమా షూటింగ్లో కాజల్ అగర్వాల్ తో పాటు ఈమె కూడా నటిస్తున్నట్లు సమాచారం.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus