Hero Vikram: పా.రంజిత్ ఈసారైనా హిట్ కొడతాడా..?

రజినికాంత్ హీరోగా దర్శకుడు పా.రంజిత్ రెండు సినిమాలను తెరకెక్కించారు. ఆయన తీసిన ‘కబాలి’, ‘కాలా’ రెండూ కూడా వర్కవుట్ కాలేదు. రజినీకాంత్ లాంటి స్టార్ హీరో ఇచ్చిన రెండు ఛాన్స్ లను సరిగ్గా వినియోగించుకోలేకపోయారు దర్శకుడు రజినీకాంత్. పైగా ఈ రెండు సినిమాలు రజినీకాంత్ క్రేజ్ ను, మార్కెట్ ను దెబ్బ తీశాయి. ‘కబాలి’ సినిమాకి కనీసం భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ‘కాలా’ సినిమా విషయంలో అదీ లేదు.

ఈ దెబ్బతో రజినీకాంత్ మార్కెట్ బాగా దెబ్బతింది. ఆ తరువాత ఆయన కోలుకోలేకపోయారు. ‘కబాలి’, ‘కాలా’ సినిమాలతో రంజిత్ ట్రాక్ రికార్డ్ కూడా దెబ్బతింది. ఆ తర్వాత రంజిత్ కెరీర్ లో చాలా గ్యాప్ వచ్చింది. చివరిగా ‘సార్పట్ట’ అనే సినిమా తీశారు. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ‘సార్పట్ట’ తరువాత మళ్లీ గ్యాప్ తీసుకున్న రంజిత్.. ఇప్పుడు మరో సూపర్ స్టార్ ని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.

విక్రమ్ హీరోగా రంజిత్ సినిమా ఓకే అయింది. ఈ మధ్యకాలంలో విక్రమ్ కూడా సరైన హిట్టు అందుకోలేకపోతున్నారు. అతడి చివరి సినిమా ‘మహాన్’ కూడా ఓటీటీలో విడుదలైంది. దానికి పెద్దగా పాజిటివ్ టాక్ రాలేదు. త్వరలోనే విక్రమ్ నటించిన ‘కోబ్రా’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అది విడుదలకాకముందే రంజిత్ దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టారు విక్రమ్.

ఈ సినిమాను జ్ఞానవేల్ రాజా నిర్మించబోతున్నారు. దీనికి జీవీ ప్రకాష్ సంగీతం అందించనున్నారు. బహు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. రంజిత్ సినిమాలంటే ఎక్కువగా శ్రామిక వర్గం గురించే ఉంటాయి. ఇది కూడా అలాంటి టైప్ సినిమానే అట. ఇదొక పీరియడ్ ఫిలిం అని అంటున్నారు. మరి ఈ సినిమాతోనా పా.రంజిత్ కి హిట్ వస్తుందేమో చూడాలి!

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus