కామెడీ బేస్డ్ యాక్షన్ ఓరియెంటెడ్ హారర్ మూవీ ‘పద్మ శ్రీ’.. జనవరి 22న రిలీజ్

చిన్న సినిమా అయినా సరే కంటెంట్ బలంగా ఉండాలే గానీ ఆ సినిమా విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇప్పటికే పలు చిన్న సినిమాలు తెలుగు చిత్రసీమలో విజయఢంకా మోగించి సత్తా చాటాయి. ఇలాంటి కోవలోకి చెందిన మరో సినిమానే ‘పద్మ శ్రీ’. కరోనా పరిస్థితుల్లో పెద్ద సినిమాలే వెనకడుగేస్తుండగా.. కథ, కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో బరిలోకి దిగుతోంది పద్మ శ్రీ టీమ్.

ఎస్. ఎస్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. ఎస్ పట్నాయక్ రచన, దర్శకత్వంలో కామెడీ బేస్డ్ యాక్షన్ ఓరియెంటెడ్ హారర్ మూవీగా ఈ పద్మశ్రీ సినిమాను రూపొందించారు. ప్రముఖ మెజీషియన్, హిప్నాటిస్ట్ బేతా శ్రీనివాసరాజు సమర్పిస్తున్న చిత్రానికి సదాశివుని శిరీష నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. మామిడి సాంబమూర్తి, కొత్తకోట బాలకృష్ణ, PVS రామ్మోహన రావు సహా నిర్మాతలుగా వ్యవహరించారు. హైదరాబాద్, ఆలంపూర్, ఉత్తరాంధ్ర లోని అందమైన లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ జరిపి భారీ సాంకేతిక విలువలతో మెరుగైన అవుట్‌పుట్ తీసుకొచ్చారు.

పెద్ద సినిమాలే రిలీజ్ చేయడానికి తర్జన భర్జన అవుతుండగా ఎంతో ధైర్యంగా ఈ పద్మ శ్రీ సినిమాను జనవరి 22న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం రూపొందించడంలో దర్శకనిర్మాతల కృషి, డైరెక్టర్ ఎస్. ఎస్ పట్నాయక్ ఆత్మ విశ్వాసం చూసి మంత్రి పేర్ని నాని అభినందించారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. ఇప్పటికే ఈ సినిమాకు ఫస్ట్ లుక్ ను నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆడియోను సంగీత దర్శకుడు కోటి ‌ లు ఆవిష్కరించారు. వారి చేతులు మీదుగా రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Share.