గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో ‘జి ఎ 2 పిక్చర్స్’ ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ల పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 1 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తొలిరోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ పర్వాలేదు అనిపించే విధంగా కలెక్షన్లు రాబట్టింది.మొత్తంగా మొదటి వారం బాక్సాఫీస్ వద్ద ఓకే అనిపించే విధంగా పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీ రెండో వీకెండ్ ను పెద్దగా వాడుకోలేకపోయింది.
ఇక రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో సత్యరాజ్, సప్తగిరి, రావు రమేష్, వరలక్ష్మీ శరత్ కుమార్, చిత్ర శుక్ల మొదలైన వారు కీలక పాత్రలు పోషించారు. ఇక ‘పక్కా కమర్షియల్’ క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :
నైజాం | 2.62 cr |
సీడెడ్ | 1.36 cr |
ఉత్తరాంధ్ర | 1.40 cr |
ఈస్ట్ | 0.70 cr |
వెస్ట్ | 0.57 cr |
గుంటూరు | 0.66 cr |
కృష్ణా | 0.70 cr |
నెల్లూరు | 0.50 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 8.51 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.55 cr |
ఓవర్సీస్ | 0.95 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 10.01 cr |
‘పక్కా కమర్షియల్’ చిత్రానికి రూ.17.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.అయితే చాలా ఏరియాల్లో ‘గీతా ఆర్ట్స్’ మరియు ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలు ఓన్ రిలీజ్ చేసుకున్నాయి. దీంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.15 కోట్లు గా ఉంది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.10.01 కోట్ల షేర్ ను రాబట్టి బిలో యావరేజ్ టు యావరేజ్ అనిపించింది.
భారీ వర్షాలు వంటివి లేకపోయి ఉంటే కనుక ఈ మూవీ ఇంకా బాగా కలెక్ట్ చేసి ఉండేదని చెప్పొచ్చు. అయితే జూలై నెలలో విడుదలైన సినిమాల్లో కొంతలో కొంత పర్వాలేదు అనిపించింది ఈ మూవీ.
Most Recommended Video
అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?