Pallavi, Nikhil: భర్తపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిఖిల్ భార్య!

టాలీవుడ్ హీరోలలో యువతలో భారీస్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో నిఖిల్ ఒకరనే సంగతి తెలిసిందే. నిఖిల్ ప్రస్తుతం 18 పేజెస్, కార్తికేయ2 సినిమాలతో బిజీగా ఉన్నారు. 2020 సంవత్సరం మే నెల 14వ తేదీన నిఖిల్ పల్లవిల వివాహం జరిగింది. అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా ఒక న్యూస్ ఛానెల్ కు నిఖిల్ పల్లవి ఇంటర్య్వూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో నిఖిల్ పల్లవి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Click Here To Watch

నిఖిల్ భార్య పల్లవి డాక్టర్ అనే సంగతి తెలిసిందే. కరోనా సమయంలో నిఖిల్ సేవా కార్యక్రమాల ద్వారా వార్తల్లో నిలిచారు. పల్లవి మాట్లాడుతూ నిఖిల్ ఇంట్లో చాలా నార్మల్ గా ఉంటారని ఒక బర్త్ డే పార్టీలో తాను నిఖిల్ కలిశామని తెలిపారు. నిఖిల్ ప్రపోజ్ చేస్తే జోక్ చేశాడని అనుకున్నానని పల్లవి తెలిపారు. లవ్ విషయంలో నిఖిల్ సీరియస్ గా లేరని అనుకున్నానని పల్లవి వెల్లడించారు. హీరోను పెళ్లి చేసుకుంటానని లైఫ్ లో అనుకోలేదని పల్లవి తెలిపారు.

హ్యాపీడేస్ సినిమా రిలీజైన సమయంలో తాను 8వ తరగతి చదువుతున్నానని పల్లవి చెప్పుకొచ్చారు. మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా తాను నిఖిల్ కలిశామని పల్లవి తెలిపారు. అత్తమ్మను కలిసిన సమయంలో నిఖిల్ రైట్ పర్సన్ అని అనిపించిందని పల్లవి వెల్లడించారు. గోవాకు వెళ్లడం బెస్ట్ మూమెంట్ అని పల్లవి పేర్కొన్నారు. నిఖిల్ గురించి గాసిప్స్ విని కొంచెం ఇబ్బందిగా ఫీలయ్యానని ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదని పల్లవి చెప్పుకొచ్చారు.

గాసిప్స్ రాకముందే వాటిని నిఖిల్ చెప్పేవారని పల్లవి అన్నారు. అనుపమ, దివ్యాంశ కౌశిక్ మంచి స్నేహితులని పల్లవి తెలిపారు.అబద్ధాలు చెబితే నిఖిల్ కు కోపం వస్తుందని పల్లవి అన్నారు. తన ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అని పల్లవి వెల్లడించారు. పల్లవికి కర్డ్ రైస్ నచ్చదని నిఖిల్ అన్నారు. పల్లవి నిఖిల్ కలకాలం అన్యోన్యంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus