Pallavi Prashanth, Sivaji: శివాజీ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసిన ప్రశాంత్!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో విన్నర్ గా నిలిచినటువంటి పల్లవి ప్రశాంత్ ఒక సాధారణ రైతుబిడ్డగా హౌస్ లోకి వచ్చి విన్నర్ గా నిలిచారు. అయితే ఈయన హౌస్ లో కొనసాగే సమయంలో శివాజీ ఈయనని బాగా సపోర్ట్ చేశారనే విషయం మనకు తెలిసిందే. ఇలా తన విజయంలో శివాజీ భాగం కావడంతో తాను శివాజీ అన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ పలు సందర్భాలలో శివాజీపై పల్లవి ప్రశాంత్ ప్రశంసల వర్షం కురిపించారు.

బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత మరోసారి బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరూ కూడా బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ మా వారు నిర్వహిస్తున్నటువంటి నా సామిరంగా అనే కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున కూడా పాల్గొనడం విశేషం. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమోలో శివాజీపై ప్రశాంత్ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ వేదికపై పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) రైతు కష్టాల గురించి తెలియజేస్తూ ఒక పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఈయన రైతు కష్టాలను తెలియజేస్తూ ఈ పెర్ఫార్మెన్స్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం పల్లవి ప్రశాంత్ శివాజీ గురించి మాట్లాడుతూ నాకు అన్నలు ఎవరూ లేరు. కానీ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన శివాజీ అన్న నేను చనిపోయే వరకు నాకు అన్నగానే ఉంటారు అంటూ ఈయన కామెంట్స్ చేయడమే కాకుండా శివాజీకి పట్టు బట్టలు కూడా పెట్టారు.

అదేవిధంగా యావర్ కూడా వీరి బ్యాచ్ అనే విషయం మనకు తెలిసిందే. ఇక యావర్ కూడా శివాజీకి ఏకంగా ఒక బంగారు కడియం తొడిగి మీరు నాకు ఎప్పటికీ ఒక అన్న తల్లి తండ్రితో సమానం అంటూ ఎమోషనల్ అయ్యారు. మొత్తానికి మరోసారి spy బ్యాచ్ మొత్తం బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus